- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మర్కజ్… దేవ్‌బంద్ వయా అజ్మీర్!
దిశ, ఆదిలాబాద్: తెలంగాణ జిల్లాలను కుదిపేస్తున్న కరోనా వైరస్ ప్రభావం కొత్త మలుపులు తిరుగుతున్నది. ఢిల్లీలోని మర్కజ్ మసీదులో ప్రార్థనలు ఒక్కటే నిన్నటిదాకా చర్చల్లోకి వచ్చింది. అక్కడ జరిగిన సమావేశంలో హాజరై వచ్చిన వారందరినీ అదుపులోకి తీసుకొని కరోనా క్వారంటైన్లలో ఉంచుతున్న విషయం తెలిసిందే. అయితే.. తాజాగా ఢిల్లీ నిఘావర్గాల హెచ్చరిక మేరకు ఈ వ్యవహారం కొత్త మలుపులు తిరుగుతోంది. ఢిల్లీలో జరిగిన సమావేశంతోపాటు ఉత్తరప్రదేశ్‌లోని దేవ్‌బంద్, రాజస్థాన్‌లోని అజ్మీర్ దర్గాకు వెళ్లి వచ్చినవారిని సైతం స్క్రీనింగ్ చేయాలని నిఘావర్గాలు హెచ్చరించాయి. నిర్మల్ జిల్లా కేంద్రానికి చెందిన ఒక మతపెద్ద తొలుత ఢిల్లీకి వెళ్లారని ప్రచారం జరిగింది. ఆ విషయాన్ని గోప్యంగా ఉంచారని ఆయనతోపాటు మరో ఇద్దరిపై పోలీసులు కేసు కూడా పెట్టారు. అయితే సదరు వ్యక్తులు ఉత్తర ప్రదేశ్‌లోని దేవ్‌బంద్‌లో జరిగిన సమావేశానికి కూడా హాజరైనట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని ఇప్పుడు ప్రభుత్వం సీరియస్‌గా తీసుకున్నది.
మర్కజ్… దేవ్ బంద్… అజ్మీర్…
గత మార్చి నెలలో ఉత్తర భారతంలోని పలు ప్రార్థనామందిరాల్లో పెద్ద ఎత్తున సమావేశాలు జరిగినట్లు ఇంటలిజెన్స్ వర్గాలు పసిగట్టినట్లు తెలుస్తోంది. ఢిల్లీ మర్కజ్‌తోపాటు ఉత్తరప్రదేశ్‌లోని దేవ్‌బంద్, రాజస్థాన్‌లోని అజ్మీర్ దర్గాకు కూడా యాత్రికులు వెళ్లినట్లు తెలుస్తోంది. మర్కజ్‌తోపాటు ఇతర ప్రాంతాలకు వెళ్లిన సమాచారం కేంద్ర నిఘావర్గాల నుంచి రాష్ట్రాలకు చేరింది. దీని ఆధారంగానే స్థానిక నిఘా అధికారులు పోలీసులతో కలిసి గాలింపు చర్యలు ముమ్మరం చేస్తున్నారు. అనేకమంది ఢిల్లీకి వెళ్లినప్పటికీ ఆ సమాచారాన్ని గోప్యంగా ఉంచుతూ… ఉత్తరప్రదేశ్‌కు మాత్రమే వెళ్లామని చెప్పి ఇక్కడి ప్రాంతాలలో ఇష్టారీతిన తిరిగిన వ్యవహారం ఇప్పుడు పోలీసు వర్గాలతోపాటు అన్ని వర్గాలను ఆందోళనకు గురి చేస్తున్నది. నిర్మల్ జిల్లా కేంద్రానికి చెందిన మత పెద్ద వ్యవహారమే దీనికి కారణమయింది. ఈ వ్యవహారం తర్వాత తెలంగాణ జిల్లాల్లోని అన్ని ప్రాంతాల్లో దేవ్‌బంద్, అజ్మీర్‌కు వెళ్లి వచ్చినవారి సమాచారాన్ని కూడా సేకరించి, వారిని పరీక్షల నిమిత్తం క్వారంటైన్‌కు తరలిస్తున్నారు.
ఎన్నెన్ని లింకులో..?
మార్చి నెల చివరి దాకా అసలు కరోనా ప్రభావమే జిల్లాల్లో కనిపించక పోగా దాని ప్రభావం క్రమంగా పెరుగుతూ వచ్చింది. అందరూ నిన్నటిదాకా ఒక మర్కజ్ పైనే దృష్టి పెట్టారు. తాజాగా నిర్మల్ కేసులు వెలుగు చూసిన తర్వాత ఇక్కడి నిఘావర్గాలు ఉలిక్కిపడ్డాయి. దేవ్‌బంద్ అజ్మీర్ దర్గా వ్యవహారం గురించి కేంద్ర నిఘావర్గాలు హెచ్చరించాయి. ఆ తర్వాత ఈ లింకుల వ్యవహారం కలవరపెడుతున్నది. సమావేశాలకు వెళ్ళినవారు ఎక్కడెక్కడ తిరిగి వచ్చారో తెలియని అయోమయ పరిస్థితి నెలకొంది. ఇప్పటికే కొంతమంది సమావేశాలకు వెళ్లి వచ్చినవారు పోలీసులకు చిక్కకుండా తిరుగుతున్నారనే సమాచారం కూడా ఆందోళనకు కారణం అవుతున్నది.
అయితే అక్కడికి వెళ్లి రావడం పెద్ద నేరమేమీ కాదని, సమాచారం ఇవ్వాలని కోరినా… దాచిపెట్టడం వల్లే ఈ పరిస్థితి ఎదురైందని ప్రభుత్వ వర్గాలు అంచనా వేస్తున్నాయి. వీరికి కరోనా పాజిటివ్ రిపోర్ట్ రావడం, వీళ్లు ప్రజల్లోనే ఉండి కలిసిన వాళ్ల లెక్క తేలక సమస్య జఠిలంగా మారుతున్నది. ఈ లింకులన్నీ తేలడానికి మరింత సమయం పడుతుందని భావిస్తున్నారు.
క్రైం బ్రాంచ్… ట్రేసింగ్ ద్వారా…
మర్కజ్‌తోపాటు దేవ్‌బంద్, అజ్మీర్ వెళ్లిన వారి సమాచారం కోసం క్రైమ్ బ్రాంచ్ రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. వివిధ ప్రాంతాల్లో తిరిగి వచ్చినవారి సమాచార సేకరణ కోసం పోలీసులు సిగ్నల్ ట్రేసింగ్ వినియోగిస్తూ వారిని పట్టుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారని చెబుతున్నారు. వీరందరి సమాచారంతోపాటు అదుపులోకి తీసుకొని పరీక్షలు నిర్వహిస్తే పూర్తిగా కట్టడి చేయవచ్చని అధికారులు భావిస్తున్నారు.
tags: Adilabad, Corona, new twist, Officers, Rajasthan, Delhi Markaz, Crime Branch Police