- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రూ.లక్ష కొట్టు బెడ్డు పట్టు… కార్పొరేట్ దందా..
దిశ, తెలంగాణ బ్యూరో: కోవిడ్ రోగులను ప్రైవేటు ఆసుపత్రి యాజమాన్యం నిలువునా దోచుకుంటుంది. పాజిటీవ్ రిపోర్ట్ తో ప్రైవేటు ఆసుపత్రికి వెళితే రూ.లక్ష చెల్లిస్తేనే అడ్మిట్ చేసుకుంటున్నారు. ప్రభుత్వం నిర్ణయించిన ధరలను, నిబంధనలను ప్రైవేటు ఆసుపత్రి యాజమాన్యాలు ఏమాత్రం లెక్క చేయడం లేదు. దీనికితోడు కరోనా పాజిటీవ్ రోగులకు అడ్వాన్స్ రిజిస్టేషన్ ఆఫర్లను అందింస్తున్నారు. నాన్ రిఫండబుల్ అమౌంట్ రూ.లక్షతో బెడ్‌లను రిజర్వ్ చేస్తున్నారు. చికిత్సల కోసం ప్రైవేటు దవాఖానాకు వెళితే జేబులు గుల్ల చేసుకోవల్సి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ప్రభుత్వ ఆసుపత్రుల్లో సరైన సదుపాయాలు కల్పించకపోవడంతో కోవిడ్ పేషెంట్లు ప్రైవేటు ఆసుపత్రులకు పరుగులు తీస్తున్నారు.
కరోనాకు తగిన చికిత్సలు అందిస్తా…. ప్రభుత్వం ఆసుపత్రుల్లో సకల సదుపాయాలు కల్పిస్తాం.. ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లి జేబులు గుల్ల చేసుకోవద్దని ప్రకటనలిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం క్షేత్ర స్థాయిలో ఆ మేరకు సదుపాయాలను కల్పిచలేకపోతన్నారు. జిల్లా కేంద్రంలోని ఆసుపత్రులకు , హైదరాబాద్ లోని గాంధీ, కింగ్ కోఠి, టిమ్స్ ఆసుపత్రులకు కోవిడ్ చికిత్సలకు వెళ్లిన వారిని వైద్య సిబ్బంది ఏమాత్రం పట్టించుకోకుండా ప్రత్యక్షనరకం చూపిస్తున్నారు. ప్రభుత్వ ఆసుపత్రిల్లో బెడ్లు ఫుల్ కావడంతో ఆక్సిజన్, ఐసీయూ బెడ్ల కోసం రోగులు ప్రైవేటు ఆసుప్రతులను ఆశ్రయిస్తున్నారు. కొన్ని ప్రభుత్వ పెద్దాసుపత్రుల్లో కోవిడ్ రోగులు మరణించి రెండు, మూడు రోజులవుతున్నాకాని బైడ్లపై నుంచి మృత దేహాలను తరలించని పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇంతటి భయానకమైన పరిస్థితుల నుంచి ప్రాణాలు కాపాడుకోవడానికి కోవిడ్ రోగులు ప్రైవేటు ఆసుపత్రులకు పరగులు తీస్తున్నారు.
రూ.లక్ష ఉంటేనే అడ్మిషన్లు
ప్రైవేటు ఆసుపత్రులకు కోవిడ్ చికిత్సల కోసం వెళితే ఆస్తులు అమ్ముకోవల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. హైదరాబాద్ లోని ప్రైవేటు కార్పోరేటు ఆసుపత్రులకు కరోనా రోగులు వెళితే ముందుగా రూ.లక్ష చెల్లిస్తేనే అడ్మిట్ చేసుకుంటున్నారు. ఆ తరువాత బెడ్ చార్జీ, ల్యాబ్ చార్జీ, డాక్టర్ ఫీజు, మెయింటనెన్స్ అంటూ బిల్లు వేసి అడ్డుఅదుపు లేకుండా రూ.లక్షలు దోచుకుంటున్నారు. వీటికితోడు అత్యవసర పరిస్థితుల్లో వినియోగించే రెమ్‌డెసివిర్ మందులు, ఆక్సిజన్ కొరత ఉందని బ్లాకులో కొనుగోలు చేశామని వాటి అసలు ధర కంటే 10రెట్లు అధికంగా వసూలు చేస్తున్నారు. ప్రాణాలు కాపాడుకోవడానికి ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లిన పేద ప్రజలు నిరాశే ఎదురవుతుంది. అడ్మిషన్ ఫీజు రూ.లక్ష ఉండటంతో చెల్లించకోలేక దిక్కుతోచని స్థితిలో పడుతున్నారు.
అడ్వాన్స్ రిజిస్ట్రేషన్ల ఆఫర్లు
కరోనా వ్యాధి సోకిన రోగులకు ప్రైవేటు ఆసుపత్రులు అడ్వాన్స్ బుకింగ్ ఆఫర్లను అందిస్తున్నాయి. రూ.లక్ష ను ముందుగా చెల్లిస్తే పేషెంట్ల పేరుపై బెడ్లను బుక్ చేసి పెడుతున్నారు. కోవిడ్ పాజిటీవ్ వచ్చిన సంపన్నులు ఈ ఆఫర్ కోసం ఎగబడుతున్నారు. హోం ఐసోలేషన్ ఉన్నవారు వ్యాధి తీవ్ర స్థాయికి చేరుకొనే పరిస్థితి తలెత్తితే వెంటనే ఆసుపత్రికి వెళ్లి అడ్మిట్ కావచ్చనే ఉద్దేశంతో అడ్వాంన్స్ బుకింగ్ చేసుకుంటున్నారు. ఈ అడ్వాన్స్ బుకింగ్ ఆఫర్‌లో మణీ నాన్ రిఫండబుల్ ఉంటుందని ప్రైవేటు ఆసుపత్రులు నిబంధనలు విధిస్తున్నాయి. నిర్ణిత రోజులు గడిచిన తరువాత పేషెంట్ రిజిస్ట్రేషన్‌ను రద్దు చేస్తున్నారు.
రాష్ట్రంలో 116 ప్రభుత్వ , 871 ప్రైవేటు ఆసుపత్రుల్లో కరోనా చికిత్సలు
కోవిడ్ చికిత్సలు అందిచేందుకు ప్రభుత్వం 10 పడకల సామర్థ్యం ఉన్న అన్ని ఆసుపత్రులకు అనుమతులను జారీ చేసింది. ఎంబీబీఎస్ అర్హత కలిగిన డాక్టర్లు కూడా కోవిడ్ కు చికిత్సలు చేయవచ్చునని ఆదేశాలు జారీ చేశారు, దీంతో రాష్ట్ర వ్యాప్తంగా 116 ప్రభుత్వ ఆసుపత్రుల్లో, 871 ప్రైవేటు ఆసుపత్రుల్లో కోవిడ్ చికిత్సలను అందిస్తున్నారు. అనుతులిచ్చిన అన్ని ఆసుపత్రుల్లో ఆక్సిజన్, ఐసీయూ బెడ్లు అందుబాటులో లేకపోవడం, జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో అరకొర సౌఖర్యాలు కల్పించడంతో కోవిడ్ రోగులు హైదరాబాద్ లోని ప్రైవేటు కార్పోరేటు ఆసుపత్రులను ఆశ్రయిస్తున్నారు.
10 రోజుల పాటు ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్సలు పొందిన కరోనా రోగికి నుంచి వసూలు చేసిన బిల్లు:
——————————————————————————-
పర్టీక్యూలర్స్ అమౌంట్
——————————————————————————-
పేషెంట్ రూం రూ.1,17,400
డాక్టర్ ఫీజు రూ.39,480
లాబోరేటరీ రూ.1,08,548
రేడియాలజీ రూ.2,430
ఇంప్లాట్స్ అండ్ అదర్స్ రూ.6,615.50
ఇన్‌టెన్సీవ్ కేర్ యూనిట్ రూ.1740
ఫుడ్ అండ్ బేవరేజెస్ రూ.530
బెడ్ సెడ్ సర్వీసెస్ రూ.50,875
కార్డియాలజీ రూ.510
ఫార్మసీ రూ.77,533
కంన్సమెబుల్స్ రూ.80,150.65
కామన్ సర్వీసు రూ.20,460
———————————————————————————-
మొత్తం రూ. 5,06,272.69
———————————————————————————-