తెలంగాణ కరోనా బులెటిన్ విడుదల

by Anukaran |
తెలంగాణ కరోనా బులెటిన్ విడుదల
X

దిశ, వెబ్ డెస్క్: రాష్ట్ర వైద్యారోగ్య శాఖ కరోనా హెల్త్ బులెటిన్ ను విడుదల చేసింది. తెలంగాణలో తాజాగా గడిచిన 24 గంటల్లో 1,842 కొత్త కేసులు నమోదయ్యాయి. ఆరుగురు మృతి చెందారు. దీంతో ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా కరోనా సోకిన వారి సంఖ్య ఒక లక్షా 6 వేల 91కి చేరింది. ఇందులో 82,411 మంది డిశ్చార్జ్ కాగా, 22,929 మంది చికిత్స పొందుతున్నారు. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు కరోనా సోకి 761 మంది మృతిచెందారు. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 36,282 కరోనా టెస్టులు నిర్వహించినట్లు ప్రభుత్వం తెలిపింది.

Advertisement

Next Story