- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కరోనా తెచ్చిన కష్టాలు.. ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్య…
దిశ, కుత్బుల్లాపూర్ : కరోనా వైరస్ కారణంగా విధించిన లాక్‌డౌన్ ఆ కుటుంబానికి శాపంగా మారింది. ఉపాధి లేక ఆర్ధిక ఇబ్బందులు తలెత్తడంతో ఓ వంట మనిషి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన పేట్‌బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఎస్సై రాంబాబు కథనం ప్రకారం… పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడు మండలం దుంపగడప గ్రామానికి చెందిన పి.దుర్గాప్రసాద్ (35) గత 4 సంవత్సరాల క్రితం ఉపాధి కోసం జీడిమెట్లలకు భార్య, పిల్లలతో కలిసి వలస వచ్చాడు. వంట మనిషిగా పని చేస్తూ కుటుంబాన్ని పోషించుకునేవాడు.
అయితే లాక్‌డౌన్ కారణంగా ఉపాధి లేక ఇబ్బందులు తలెత్తడంతో మనస్థాపానికి గురైన దుర్గాప్రసాద్ ఆదివారం రాత్రి భార్య, పిల్లలతో కలిసి బెడ్రూంలో పడుకున్నాడు. అందరు నిద్రపోయాక వెలుపలకు వచ్చి బెడ్రూం కు గడియ పెట్టాడు. కాటన్ క్లాత్ తో సీలింగ్ ఫ్యాన్ కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సోమవారం తెల్లవారు జామున భార్య తలుపు తీసినా రాకపోవడంతో కేకలు వేసింది. స్థానికులు అక్కడకు చేరుకుని పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం వైద్యశాలకు తరలించి దర్యాప్తు చేస్తున్నారు.