కొవిడ్ ఎఫెక్ట్ : ప్రైవేట్ హాస్పిటల్స్.. హౌజ్ ఫుల్

by vinod kumar |
కొవిడ్ ఎఫెక్ట్ : ప్రైవేట్ హాస్పిటల్స్.. హౌజ్ ఫుల్
X

దిశ, తెలంగాణ బ్యూరో: గ్రేటర్ హైదరాబాద్‌లో పెరుగుతున్న కరోనా కేసుల నేపథ్యంలో కరోనా బెడ్స్ కొరత కనిపిస్తోంది. జీహెచ్ఎంసీ పరిధిలో పలు ప్రముఖ ప్రైవేట్, కార్పొరేట్ ఆస్పత్రుల్లో కరోనా బెడ్స్ పూర్తిగా నిండిపోయి ఉండటం ప్రస్తుత పరిస్థితుల్లో ఆందోళన కలిగిస్తోంది. జీహెచ్ఎంసీ పరిధిలోని ప్రైవేట్ ఆస్పత్రుల్లో కొవిడ్ పేషంట్ల కోసం కేటాయించిన బెడ్స్ ఇప్పటికే నిండిపోయి ఉన్నాయి. సికింద్రాబాద్ అపోలో ఆస్పత్రిలో కేటాయించిన రెగ్యులర్ బెడ్స్ 25 పూర్తిగా భర్తీ అయ్యాయి. బంజారాహిల్స్ కేర్ ఆస్పత్రిలోని తొమ్మిది బెడ్స్ కేటాయించగా.. తొమ్మిది మంది కరోనా పేషంట్లు చేరిపోయారు. గ్లోబల్ ఆస్ప్రతిలో 18 బెడ్స్, లంగర్ హౌజ్ రెనోవా ఆస్ప్రతిలో 13 పూర్తిగా నిండిపోయాయి.

హైటెక్ సిటీలోని కేర్ ఆస్పత్రిలో 24, హైదరాబాద్ గూడ అపోలో 11 ఆక్సిజన్ బెడ్స్ కేటాయించగా.. కరోనా పేషంట్స్ చికిత్స పొందుతున్నారు. సికింద్రాబాద్ కిమ్స్‌లో 100 బెడ్స్‌లకుగాను 95, కొండాపూర్ కిమ్స్‌లో 30 పడకలు ఉండగా.. 29 మంది జాయిన్ అయ్యారు. కరోనా పాజిటివ్ నిర్ధారణ కాగానే ముందుగా ప్రైవేట్ ఆస్పత్రులను ఆశ్రయించేవారి సంఖ్య పెరిగిపోయింది. నగరంలోని పలు ప్రముఖ ఆస్పత్రులు కరోనా పేషంట్లకు కేటాయించిన బెడ్స్ ఇప్పటికే నిండిపోవడంతో చికిత్స పొందేందుకు అడ్డంకిగా మారనుంది. ఈ పరిస్థితుల్లో కరోనా కేసుల సంఖ్యను సాధ్యమైనంతగా తగ్గించేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పండుగలను కొవిడ్ జాగ్రత్తలతో జరుపుకోవాలంటూ అందులో సూచించింది. అయితే ఇదే సమయంలో రాష్ట్రంలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో 7,561 బెడ్స్ ఖాళీగా ఉన్నట్టు ప్రభుత్వం తెలిపింది. అత్యధికంగా గాంధీ ఆస్పత్రిలో 1,890 బెడ్స్ ఉండగా… 117 మాత్రమే భర్తీ అయ్యాయి. ఇంకా 1,773 బెడ్స్ ఖాళీగా ఉన్నాయి. కరోనా చికిత్స కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన టిమ్స్‌ రెండో స్థానంతో 992 బెడ్స్ ఖాళీగా ఉన్నట్టు ప్రభుత్వం తెలిపింది.

ఆస్పత్రి మొత్తం ఆక్యూపైడ్ ఖాళీ
అపోలో జూబ్లీహిల్స్ 78 66 12
కేర్ బంజారాహిల్స్ 40 32 8
యశోద సోమాజీగూడ 105 75 30
గ్లోబల్ హాస్పిటల్ 30 30 0
కిమ్స్, సికింద్రాబాద్ 150 125 25

Advertisement

Next Story

Most Viewed