- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఏపీలో కరోనా @ 4126
దిశ, ఏపీ బ్యూరో: ఆంధ్రప్రదేశ్లో కరోనా విజృంభిస్తోంది. ఏపీలో గడచిన 24 గంటల్లో 136 మందికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయిందని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ప్రకటించింది. మరోవైపు ఆ 24 గంటల్లో 72 మంది కరోనా చికిత్స పొంది కోలుకున్నారని వెల్లడించింది. దీంతో ఏపీలో మొత్తం నమోదైన కరోనా కేసుల సంఖ్య 4,126 అని స్పష్టం చేసింది. కాగా, ఇంతమందిలో ఆస్పత్రుల్లో 1,573 మంది చికిత్స పొందుతుండగా, చికిత్స పొందడం ద్వారా ఇప్పటివరకు 2,475 మంది కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారని ప్రకటించింది. ఏపీలో కరోనా కారణంగా మృతిచెందిన వారి సంఖ్య 78 కి చేరిందని తెలిపింది. మరోవైపు విదేశాలతోపాటు పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చిన వారికి చేసిన టెస్టుల్లో 82 మందికి కరోనా సోకినట్టు తేలింది. గడచిన 24 గంటల్లో 15,384 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించినట్టు వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.