- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కొత్తిమీర పచ్చడి రెసిపీ
కొత్తిమీర పచ్చడి టిఫిన్స్, రైస్, ఇతర చిరుతిళ్లలో నంచుకుని తింటే ఎంతో టేస్టీగా ఉంటుంది. పుల్లగా, ఘాటుగా ఎంతో రుచిగా ఉండే ఈ పచ్చడి.. ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇప్పుడు కొత్తిమీర పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం..
కావాల్సిన పదార్ధాలు..
కొత్తిమీర కట్టలు -3
పచ్చిమిర్చి -2
ఎండు మిర్చి -2
శనగపప్పు – 1టేబుల్ స్పూన్
మినప్పప్పు -1టేబుల్ స్పూన్
నూనె -2 టేబుల్ స్పూన్
జీలకర్ర -అర టీస్పూన్
ఆవాలు -ఒక టీస్పూన్
కరివేపాకు -ఒక కట్ట
చింతపండు -కొద్దిగా
ఉప్పు -రుచికి తగినంత
తయారుచేసే విధానం..
ఒక పాన్‌లో నూనె వేసుకుని కాస్త వేడి అయ్యాక అవాలు వేయాలి. తర్వాత ఎండు మిర్చి, శనగపప్పు, మినప్పప్పు వేసి వేయించుకోవాలి. రెండు నిమిషాల పాటు వేగిన తర్వాత ఒక ప్లేట్‌లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. అనంతరం అదే పాన్‌లో కొత్తిమీర, పచ్చిమిర్చి వేసి వేగించుకోవాలి. ముందుగా వేగించిన పప్పులు, పచ్చిమిర్చి, కొత్తిమీర, చింతపండు తీసుకుని వాటిలో తగినంత ఉప్పు వేసి మిక్సీలో గ్రైండ్ చేసుకోవాలి. కొద్దిగా నీళ్లు పోసి చిక్కటి పేస్టులా కలుపుకోవాలి. ఇప్పుడు పాన్‌లో నూనె వేసి జీలకర్ర, కరివేపాకు వేగించాలి. దీనిలో గ్రైండ్ చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని కలుపుకోవాలి. అంతే టేస్టీగా ఉండే కొత్తిమీర పచ్చడి రెడీ.