- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బస్సే.. బస్ షెల్టరైంది…!!
దిశ ప్రతినిధి, ఆదిలాబాద్ : ఆర్టీసీ అధికారుల ఆలోచనతో ఓ బస్సు.. ఏక౦గా బస్ షెల్టర్ గా మారింది. నిర్మల్ లోని ప్రధాన చౌరస్తా నుండి నిజామాబాద్, హైద్రాబాద్, భైంసా, ఖానాపూర్, మంచిర్యాల వెళ్లే బస్సులన్నీ ఈ చౌరస్తా మీదుగానే వెళతాయి. అసలే ఎండాకాలం.. అందులోనూ ఎండలు మండిపోతున్నాయి. ఇక్కడ నిత్యం వేలాది మంది ప్రయాణీకులు రాకపోకల కోసం వేచి ఉంటారు. ఇలాంటి వారికోసం అప్పటికప్పుడు బస్షెల్టర్ నిర్మాణం సాధ్యం కానందున ఓ బస్సును తాత్కాలిక షెల్టర్ గా మార్చారు. అధికారులకు వచ్చిన ఈ ఐడియా చాలా బాగుంది కదూ… పూర్తి వివరాల్లోకి వెళితే.. నిర్మల్ లోని మంచిర్యాల చౌరస్తాలో ప్రయాణికుల సౌకర్యార్థం, ఎండ తీవ్రతను తట్టుకోవడానికి ఆర్టీసీ వారు శుక్రవారం తాత్కాలిక బస్ షెల్టర్ ను ఏర్పాటు చేశారు.
ఇప్పటికిప్పుడు షెల్టర్ ను వేయలేరు కాబట్టి ఏకంగా మంచిర్యాల ఎక్స్ రోడ్డు వద్ద హైదరాబాద్, నిజామాబాద్ వెళ్లే రూట్లో ఒక బస్సునే నిలిపారు. అందులో నీట్ గా సీట్లు వేసి శానిటేషన్ చేయించి శుభ్రపరచి ఉంచారు.ఆ బస్సులో త్రాగునీరు సౌకర్యం కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడ బస్సు కొరకు వేచిచూసే ప్రయాణికులు ఎండలో నిలబడుతున్నారని, వారి కోసమే ఈ తాత్కాలిక బస్ షెల్టర్ ను ఏర్పాటు చేశామని, ప్రయాణికులు ఈ బస్ షెల్టర్ ను ఉపయోగించుకోవాలని డిపో మేనేజర్ కే.ఆంజనేయులు కోరారు.