- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- OTT Release
హనుమంతుడి జన్మస్థలం అంజనాద్రే.. కాదు కాదు కిష్కింద..!
దిశ, వెబ్‌డెస్క్ : శ్రీ రాముడి జన్మస్థలం గురించి దేశంలో ఎంత పెద్ద చర్చ జరిగిందో అందరికీ తెలిసిందే. కేవలం చర్చతో ఆగిపోకుండా కోర్టు, కమ్యూనిటీ వివాదాలు అన్నింటినీ దాటుకుని యూపీలోని అయోధ్యను రాముడి జన్మస్థలంగా గుర్తిస్తూ.. అక్కడ రామాలయం నిర్మాణానికి దేశ అత్యున్నత న్యాయస్థానం అనుమతి కూడా ఇచ్చింది. ప్రస్తుతం రామాలయ నిర్మాణానికి సంబంధించిన ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. అప్పుడు రాముడి జన్మస్థలంపై పెద్ద చర్చ జరిగితే ప్రస్తుతం ఏపీలో హనుమంతుడి జన్మస్థలంపై వివాదం రాజుకుంది.
సప్తగిరుల్లోని అంజనాద్రే హనుమంతుడి జన్మస్థలమని తిరుమల తిరుపతి దేశస్థానం గట్టిగా వాదిస్తోంది. అందుకు సంబంధించిన రుజువులు కూడా ఉన్నాయని చెబుతోంది.అయితే, కర్నాటకలోని కిష్కింద పర్వతమే హనుమ జన్మస్థలమని గోవింద సరస్వతి వెల్లడించారు. కొన్నిరోజులుగా అంజేనేయుడి జన్మస్థలంపై టీటీడీ చేస్తున్న వ్యాఖ్యలను ఆక్షేపిస్తూ గోవింద సరస్వతి శనివారం బోర్డుకు లేఖ రాశారు. హనుమ జన్మస్థలంపై టీటీడీ నివేదక అవాస్తమని అందులో పేర్కొన్నారు. పురాణ ఇతిహాసాలను తమ స్వార్థానికి వాడుకుంటున్నారని ఆరోపించారు. అసత్యాలను సత్యాలుగా చిత్రీకరిస్తున్నారని గోవింద సరస్వతి మండిపడ్డారు. తాను రాసిన లేఖపై టీటీడీ వివరణ ఇవ్వకపోతే తిరుమల వచ్చి నిరూపిస్తామని స్పష్టం చేశారు.