లేఖ ద్వారానే కాంగ్రెస్‌లో వివాదం: పీసీ చాకో

by Anukaran |   ( Updated:2020-08-25 01:49:03.0  )
PC Chacko
X

దిశ, వెబ్ డెస్క్: నిన్న జరిగిన సీడీబ్ల్యూసీ సమావేశంలో రాహుల్ గాంధీకి, కాంగ్రెస్ నేతల మధ్య మాటల యుద్ధం తలెత్తిన విషయం తెలిసిందే. సోనియా గాంధీకి సీనియర్ నేతలు లేఖ రాయడంపై రాహుల్ ఫైరైన విషయం విధితమే. ఈ తరుణంలో రాహుల్ పై సీనియర్ నేతలు కూడా మండిపడ్డారు. అనంతరం అజాద్ ఇంట్లో సీనియర్ నేతలంతా కలిసి సమావేశమయ్యారు. ఇలా ప్రస్తుతం కాంగ్రెస్ లో కోల్డ్ వార్ చిలికి చిలికి గాలి వానలా తయారైంది.

అయితే, ఈ అంశంపై ప్రముఖ కాంగ్రెస్ సీనియర్ నేత పీసీ చాకో స్పందించారు. ఓ నేషనల్ మీడియాతో మాట్లాడుతూ.. ‘ప్రస్తుతం కాంగ్రెస్ నాయకత్వంలో కొన్ని విషయాలను సరిదిద్దాల్చిన అవసరం ఉంది. కానీ, సీనియర్ నేతలు ఆ విధంగా లేఖ రూపంలో తమ ఆలోచనను వ్యక్తపరచడం సరికాదు. ఆ లేఖ ద్వారానే వివాదం చెలరేగింది. సీడబ్ల్యూసీ సమావేశానికి ఒక్కరోజు ముందే ఇలా లేఖ రాయడం సరికాదు. సమావేశంలో వారి ఆలోచనలను పంచుకుంటే బాగుండు’ అని కాంగ్రెస్ సీనియర్ నేత పీసీ చాకో అన్నారు.

Advertisement

Next Story

Most Viewed