- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
లాభసాటి వ్యవసాయమే కేసీఆర్ ధ్యేయం
దిశ, ఖమ్మం: వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడమే సీఎం కేసీఆర్ ధ్యేయమని రవాణా శాఖ మంత్రి అజయ్ కుమార్ అన్నారు. వాణిజ్య పంటల సాగును ప్రోత్సహిస్తూ, వానాకాలం-2020 నియంత్రిత పంటల సాగు విధానంపై భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని క్లబ్‌లో నిర్వహించిన అవగాహన కార్యక్రమానికి మంత్రి హాజరై మాట్లాడారు. రైతులంతా ఒకే రకం పంట వేసి నష్టపోకుండా డిమాండ్‌కు తగినట్లు పంట సాగు చేయాలన్నారు.నేల స్వభావం, మార్కెట్లో డిమాండ్‌ను బట్టి పంటలు పండించేలా నిర్ణయం తీసుకోవాలని సూచించారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంటకు గిట్టుబాటు ధర వచ్చినప్పుడే వ్యవసాయం లాభసాటిగా మారుతుందన్నారు.ఈ విషయాన్ని రైతులకు విడమరిచి చెప్పాల్సిన బాధ్యత మీపై ఉందని అధికారులకు తెలియపరిచారు. సన్నరకం వరి సాగుకు మొదట ప్రాధాన్యమివ్వాలని వివరించారు. కంది, పత్తి పంటల విస్తీర్ణం పెంచి రైతుకు లాభం చేకూరేలా చూడాలన్నారు. పట్టణాలకు సమీపంలోని వ్యవసాయ భూముల్లో కూరగాయలు ఎక్కువగా పండించాలని, అలాగే వరి, పత్తి, కంది, మిర్చీపైన కూడా ఎక్కువ దృష్టి సారించాలన్నారు.ఈసారి మొక్కజొన్న జోలికి పోవొద్దని రైతులకు సూచించారు.నియంత్రిత వ్యవసాయంపై అవగాహన కల్పించేందుకు జిల్లా రైతు బంధు కో-ఆర్డినేటర్లు, జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు సమాయత్తం కావాలన్నారు. కార్యక్రమంలో ఎంపీ నామా నాగేశ్వరరావు , జిల్లా కలెక్టర్ ఎంవీరెడ్డి, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, ఎమ్మెల్యేలు హరిప్రియ, రాములు నాయక్, వనమా వెంకటేశ్వరరావు, జెడ్పీ చైర్మన్ కోరం కనకయ్య, రైతు బంధు జిల్లా కన్వీనర్ కృష్ణ రెడ్డి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ దిండిగల రాజేందర్, అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, జిల్లా వ్యవసాయ అధికారి అభూమాన్యుడు ఉన్నారు.