కరోనా నియంత్రణకు రూ.2 లక్షల విరాళం

by Shyam |
MInister Harish rao
X

దిశ, మెదక్: కరోనా కారణంగా లాక్‌డౌన్ నేపథ్యంలో పేద ప్రజలను ఆదుకునేందుకు తమ వంతు సాయంగా రూ.2 లక్షల విరాళాన్ని సిద్ధిపేట రైస్ మిల్లు అసోసియేషన్ ప్రకటించింది. సిద్ధిపేట సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలో సోమవారం రాత్రి జిల్లా రైస్ మిల్స్ అసోసియేషన్ అధ్యక్షుడు చంద్రశేఖర్ చేతుల మీదుగా రూ.2 లక్షల చెక్కును మంత్రి హరీశ్ రావుకు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ.. రెక్కాడితే కానీ డొక్కాడని చాలా మంది నిరుపేదలకు లాక్‌ డౌన్ సందర్భంగా పనిలేకుండా పోయిందని, వారిని ఆదుకునేందుకు ఇప్పటికే ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటోందని రేపటి నుంచి రేషన్ షాపుల ద్వారా సరుకులు అందజేయనున్నట్టు మంత్రి తెలిపారు. ఇందులో భాగంగానే ప్రముఖ పారిశ్రామిక వేత్తలు తమ వంతు సామాజిక బాధ్యతగా విరాళాలు ప్రకటిస్తున్నారని, మరికొందరు స్వయంగా రంగంలోకి దిగి తమ వంతు ఆర్ధిక సాయం అందిస్తున్నారు. ఈ సందర్భంగా సిద్ధిపేట రైస్ మిల్లర్స్ అసోసియేషన్ తమ వంతు సాయంగా రూ.2 లక్షలను విరాళంగా అందజేయడం అభినందనీయమని చెబుతూ వారికి కృతజ్ఞతలు తెలియజేశారు. మరింత పారిశ్రామిక వేత్తలు ముందుకు రావాలని మంత్రి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పి.వెంకట్రామ రెడ్డి, పోలీసు కమిషనర్ జోయల్ డేవీస్, రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షుడు తదితరులు పాల్గొన్నారు.

Tags : Contribution, Rs.2 lakh, Corona control, medak, siddipet, harish rao

Advertisement

Next Story

Most Viewed