జగనన్నా.. మాట నిలుపుకో..!

by srinivas |
జగనన్నా.. మాట నిలుపుకో..!
X

దిశ, ఏపీ బ్యూరో: కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తామని ఏడాదిన్నర క్రితం సీఎం జగన్ హామీ ఇచ్చారు. ఇంతవరకు పట్టించుకోలేదు. ఇది చాలా దారుణమంటూ వైద్య ఆరోగ్య శాఖకు చెందిన కాంట్రాక్టు ఉద్యోగులు ఐదుగురు వాటర్ ట్యాంకు ఎక్కి నిరసన తెలిపారు. మంగళవారం ఈ ఘటన పశ్చిమ గోదావరి జిల్లా పాలకోడేరు మండల కేంద్రంలో చోటుచేసుకుంది.

జిల్లా సెలక్షన్ కమిటీ ద్వారా ఎంపికయిన తాము 19 ఏళ్లుగా కాంట్రాక్ట్ హెల్త్ అసిస్టెంట్లుగా పని చేస్తున్నట్లు తెలిపారు. ప్రతిపక్షనేతగా ఉన్పప్పుడు జగన్మోహన్రెడ్డి ఇచ్చిన హామీని సీఎం అయ్యాక కూడా నెరవేర్చకపోవడం అన్యాయమని ఆవేదన వ్యక్తం చేశారు. జగనన్నా.. ఇచ్చిన మాట నిలుపుకో అంటూ నినాదాలు చేశారు. వాళ్ల సమస్యను సీఎం దృష్టికి తీసుకెళ్తామని మండల అధికారులు హామీ ఇవ్వడంతో ట్యాంకు దిగి వచ్చారు.

Advertisement
Next Story

Most Viewed