- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నా తల్లిని చంపేశారు.. ప్రభుత్వం ఏం చేస్తోందన్న కానిస్టేబుల్
దిశ ప్రతినిధి, కరీంనగర్ : తన తల్లికి చికిత్స చేసేందుకు ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్లు, సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించారంటూ ఓ కానిస్టేబుల్ కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఈ విషాద ఘటన శుక్రవారం కరీంనగర్ జిల్లా ఆస్పత్రిలో చోటు చేసుకుంది. వివరాల ప్రకారం.. కరీంనగర్ కలెక్టర్ బంగ్లాలో గార్డుగా పనిచేస్తున్న ఏఆర్ కానిస్టేబుల్ సంజీవ్.. తన తల్లికి కరోనా సోకడంతో జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
15 నిమిషాలైనా ఆసుపత్రి సిబ్బంది ఎవరూ పట్టించుకోవడం లేదంటూ సంజీవ్ ఆవేదన వ్యక్తం చేశారు. చివరకు తన సహచర కానిస్టేబుల్‌కు ఫోన్ చేసి తన తల్లికి వైద్యం అందించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని కలెక్టర్‌కు చెప్పాలని వేడుకున్నాడు. కానీ చివరకు సంజీవ్ తల్లి చనిపోవడం అతని కుటుంబం దుఖంలో మునిగిపోయింది. ఎవరూ పట్టించుకోవడం లేదంటూ సంజీవ్ రోధిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో కరీంనగర్‌లో ఈ విషయం పెద్ద చర్చకు దారి తీసింది.