సెల్‌ఫోన్ దొంగతనం కేసులో కానిస్టేబుల్ రిమాండ్

by Sridhar Babu |
సెల్‌ఫోన్ దొంగతనం కేసులో కానిస్టేబుల్ రిమాండ్
X

దిశ ‌ప్ర‌తినిధి, ఖ‌మ్మం: గతంలో ఖ‌మ్మం ప‌ట్ట‌ణంలోని టు టౌన్ పోలీసుస్టేషన్‌లో ఐ.డి పార్టీ‌లో విధులు నిర్వహించిన రాజుపై టు టౌన్ సి.ఐ గోపి కేసు నమోదు చేసి మంగళవారం రిమాండ్‌కు తరలించారు. వివరాల్లోకి వెళితే 2018లో టు టౌన్ లో ఐ.డి పార్టిగా రాజు విధులు నిర్వహించాడు. కాగా అప్పుడు ఒక దొంగతనం కేసు నమోదు కాగా పోలీసులు దానిని ఛేదించి కొంత ప్రాపర్టీ‌తో పాటు సెల్‌ఫొన్ సైతం స్వాధీన పర్చుకొని కోర్టుకు అప్పగించారు. ఈ నేపథ్యంలో కోర్టు పరిధిలో ఉన్న సెల్ ఫోన్‌ను రాజు దొంగతనం చేశాడు. కాగా కోర్టు పరిధిలో ఉన్న సెల్‌ఫోన్ లేకపోవడంతో కోర్టు ఆదేశాల మేరకు విచారణ చేపట్టిన సి.ఐ గోపీ ఆ ఫోన్‌ను రాజు దొంగతనం చేశాడని తెలపటంతో మంగళవారం అతనిని రిమాండ్‌కు తరలించారు. కాగా ప్రస్తుతం రాజు మణుగురులో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నాడు.

Advertisement

Next Story