కాపురంలో నిప్పులు పోసిన కానిస్టేబుల్

by Anukaran |   ( Updated:2020-07-26 12:08:19.0  )
కాపురంలో నిప్పులు పోసిన కానిస్టేబుల్
X

దిశ, క్రైమ్​బ్యూరో: పచ్చని సంసారంలో ఓ కానిస్టేబుల్ నిప్పులు పోశాడు. ఓ మహిళతో అక్రమ సంబంధం పెట్టుకొని ఆమె కుటుంబాన్ని ఆగం చేశాడు. ముగ్గురు పిల్లలు, భర్తతో కలిసి హాయిగా జీవిస్తున్న ఓ మహిళతో పరిచయం పెంచుకొన్న కానిస్టేబుల్ వంకర బుద్ధి బయట పెట్టుకున్నాడు. తనకు పెండ్లయి భార్య ఉన్నా.. కామంతో మరో పరాయి స్త్రీతో పాపపు పనికి ఒడిగట్టాడు. ఇలాంటి చెడు తిరుగుళ్లు మానుకోవాలని భర్త ఎన్నిసార్లు చెప్పినా కానిస్టేబుల్‌తోనే దొంగచాటుగా వ్యవహారం నడిపిన మహిళ ఇప్పుడు కుటుంబ పరువును బజారులో వేసింది. కన్న పిల్లలకు ఏం సమాధానం చెప్పలేని స్థితికి చేరింది. హైదరాబాద్‌లో చోటు చేసుకున్న ఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి.

రాచకొండ కమిషనరేట్ పరిధిలోని హయతనగర్ సత్యనగర్‌కు చెందిన ఓ వ్యక్తి సెలూన్ షాపును నడిపిస్తున్నాడు. ఇతనికి 2006లో వివాహం కాగా ఇదరు కుమార్తెలు, ఓ కుమారుడు. ఇదేక్రమంలో రాఘవేంద్రకాలనీలో అద్దెకు ఉంటున్న సమయంలో హయత్‌నగర్ పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న బలుగూరి సంజయ్ సాగర్ (ప్రస్తుతం సరూర్‌నగర్) అదే ఇంట్లోని పై అంతస్తులో జిమ్‌కు వెళ్లి వస్తూ మహిళతో పరిచయం పెంచుకున్నాడు. కొద్దిరోజుల తర్వాత మహిళతో వివాహేతర సంబంధాన్ని మొదలు పెట్టాడు. భర్త ఇంట్లో లేని సమయంలో మహిళను… తన బైక్‌పై తీసుకొని లాంగ్‌ డ్రైవ్‌కు వెళ్లేవాడు. ఇదే క్రమంలో మహిళను ఇంట్లో నుంచి తీసుకు వచ్చి మీర్‌పేటలో రూమ్‌ రెంట్‌కు తీసుకొని ఉన్నారు. ఈ నేపథ్యంలోనే కానిస్టేబుల్ బైక్‌పై తీసుకెళ్తున్న సమయంలో ప్రమాదం జరిగి ఆ మహిళ కూతురు చనిపోయింది.

కానిస్టేబుల్‌పై ఆ మహిళ భర్త ఫిర్యాదు చేయడానికి వెళ్తుండగా… సంజయ్ సాగర్ కుటుంబ సభ్యులు జోక్యం చేసుకొని క్షమాపణ కోరారు. కొద్దిరోజుల పాటు భర్తతో సఖ్యతగా ఉన్న మహిళ హయత్‌నగర్ సత్యనగర్‌లోని ఇళ్లును తన పేరిట రాయించుకుంది. ఇదే క్రమంలో మళ్లీ మహిళకు టచ్‌లోకి వచ్చిన కానిస్టేబుల్ సంజయ్ సాగర్… ఆ మహిళ భర్తను బెదిరింపులకు గురిచేయడం స్టార్ట్ చేశాడు. అంతేగాకుండా ఖమ్మం జిల్లా కూసుమంచి స్టేసన్‌లో ఆ మహిళతో కేసు పెట్టించాడు. ఇల్లు తనపేరు మీదే ఉంది.. నీకు నాకు సంబంధం లేదని .. భర్తను ఇంటికి రాకుండా చేశారు. దీంతో తన భార్య, కానిస్టేబుల్ చేష్టలతో విసిగి పోయిన ఆ వ్యక్తి తనకు న్యాయం చేయాలని కోరుతూ రాచకొండ పోలీస్ కమిషనర్ మహేశ్ భగవత్ కు ఫిర్యాదు చేశారు.

Advertisement

Next Story