- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
దిశ, వెబ్ డెస్క్: అనంతపురం జిల్లాలో ఓ కానిస్టేబుల్ రెచ్చిపోయాడు. ఏకంగా పోలీస్ స్టేషన్‌లో హోంగార్డ్‌ను చితక్కొట్టాడు. తన సస్పెన్షన్‌కి హోంగార్డే కారణమని భావించిన కానిస్టేబుల్ అతడిపై దాడికి పాల్పడ్డాడు. దుర్భాషలాడుతూ చితక్కొట్టాడు. ఈ షాకింగ్ ఘటన కదిరి సబ్‌డివిజన్ పరిధిలోని ఓ పోలీస్ స్టేషన్లో జరిగింది. ఆ పీఎస్‌లో పనిచేస్తున్న కానిస్టేబుల్ ఇటీవల పేకాట, అక్రమ మద్యంలో తరలిస్తున్న కొందరిని అదుపులోకి తీసుకున్నాడు. డబ్బులు తీసుకుని అందులో ఓ వ్యక్తిని తప్పించినట్లు ఆరోపణలు వచ్చాయి.
ఈ విషయ ఉన్నతాధికారులకు దృష్టికి చేరింది. దీంతో సబ్‌డివిజన్ ఉన్నతాధికారులతో ఎస్పీ విచారణ చేయించారు. అది నిజమని నిర్ధారణ కావడంతో ఎస్పీ సత్య యేసుబాబు కానిస్టేబుల్‌పై సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ విషయం తెలుసుకున్న ఆ కానిస్టేబుల్ స్టేషన్‌కు చేరుకున్నాడు. హోంగార్డు వల్లే తనపై సస్పెన్షన్ వేటు పడిందని భావించి ఆగ్రహంతో అతడిపై దాడికి పాల్పడ్డాడు. దాంతో స్టేషన్‌లో ఉన్నవారంతా అవాక్కయ్యారు. అనంతరం ఇద్దరిని శాంతపరిచారు. విషయం జిల్లా పోలీసు ఉన్నతా ధికారులకు తెలియడంతో బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. తను చేసిన తప్పును సరిదిద్దుకోవాల్సిన కానిస్టేబుల్ దాడి చేయడంపట్ల పలు విమర్శలు వ్యక్తమవుతున్నాయి.