‘దళితబంధు’ పేరిట భారీ మోసం.. నిరుద్యోగ నోటిఫికేషన్ల ఊసెత్తని ప్రభుత్వం..?

by Aamani |   ( Updated:2021-10-18 06:44:30.0  )
‘దళితబంధు’ పేరిట భారీ మోసం.. నిరుద్యోగ నోటిఫికేషన్ల ఊసెత్తని ప్రభుత్వం..?
X

దిశ, మణుగూరు : తెలంగాణలో సీఎం కేసీఆర్ పరిపాలనలో నిరుద్యోగులు బతికే పరిస్థితి లేకుండా పోయిందని కరకగూడెం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఏ బ్లాక్ కోఆర్డినేటర్ సయ్యద్ ఇబ్బల్ హుస్సేన్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. సోమవారం మండలంలోని ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ.. కేసీఆర్ దొంగ పరిపాలన చేస్తూ నిరుద్యోగుల ప్రాణాలను పీక్కుతింటున్నాడని విమర్శించారు. యువతీయువకులు ఉన్నత చదువులు చదవి, ఉద్యోగాలు లేక నరకయాతన అనుభవిస్తు్న్నారని ఫైర్ అయ్యారు. సమాజం పచ్చగా ఉండాలంటే యువతే కీలకమని తెలిపారు. కేసీఆర్ పరిపాలనలో రాష్ట్రంలో యువతకు ఎక్కడ ఉద్యోగాలు ఇచ్చారో చెప్పాలన్నారు. రాష్ట్రంలో ఎంతో మంది యువకులు ఉద్యోగాలు లేక కుటుంబపోషణ భారమై ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

దళితబంధు పేరుతో ఘరానా మోసం..

రాష్ట్రంలో దళితబంధు పథకం పేరు చెప్పి ప్రజలను సీఎం కేసీఆర్ మోసం చేస్తున్నాడని కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు. హుజురాబాద్‌లో ఎన్నికలు ఉన్నందున దళితబంధు పేరు చెప్పి, ప్రజలను మభ్యపెట్టి ఓట్ల కోసం డ్రామా చేస్తున్నారని అన్నారు.దళితబంధు పథకం కింద హుజురాబాద్‌లో ఎంతమంది బెనిఫిట్ పొందారని అడిగారు. హుజురాబాద్‌లోనే కొందరికి దళితబంధు ఇచ్చినట్టు ఇచ్చి మళ్ళీ వెనక్కి తీసుకున్న పిచ్చి తుక్లక్ కేసీఆర్ అని గుర్తుచేశారు. నీకు చేతనైతే ఎస్సీ,ఎస్టీ, బీసీ, మైనారిటీలకు బంధం కల్పించాలని ప్రశ్నించారు. లేనియెడల రాస్తారోకోలు నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో మండల కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షులు నాగ బండి వెంకటేశ్వర్లు, మహిళా నాయకురాలు చందా రత్నమ్మ, యువజన అధ్యక్షులు కునుసోత్ సాగర్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story