కేరళలో కమ్యూనిస్టు vs కాంగ్రెస్ పార్టీ..

by Shamantha N |
కేరళలో కమ్యూనిస్టు vs కాంగ్రెస్ పార్టీ..
X

దిశ, వెబ్‌డెస్క్: కేరళలో అధికార కమ్యూనిస్టు అండ్ కాంగ్రెస్ పార్టీల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. తాజాగా ఆ రాష్ట్రంలో బాలల హక్కుల కమిషన్ చైర్మన్‌గా సీపీఎం నేత కేవీ మనోజ్ కుమార్‌ నియామకం పై కాంగ్రెస్ పార్టీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. బాలల హక్కుల పరిరక్షణలో ఏ మాత్రం అనుభవం లేని వ్యక్తిని ఎలా నియమిస్తారని ప్రశ్నించింది.దీనిని ప్రజలు ఎట్టిపరిస్థితుల్లోనూ ఆమోదించరని ప్రకటించింది. బుధవారం కేరళ కాంగ్రెస్ సీనియర్ నేత రమేశ్ చెన్నితల మీడియాతో మాట్లాడుతూ.. సీపీఎం నేత కేవీ మనోజ్ కుమార్‌ను కేరళ బాలల హక్కుల కమిషన్ చైర్మన్‌గా నియమించారని, ఆయనకు ఈ రంగంలో కనీస అనుభవం లేదని ఆరోపించారు. మనోజ్ కుమార్ నియామకం ప్రజలకు పెను సవాలు వంటిదన్నారు. చైర్మన్ పదవి హోదా చీఫ్ సెక్రటరీ స్థాయితో సమానమని గుర్తుచేశారు. ఈ పదవినీ గతంలో మాజీ చీఫ్ సెక్రటరీలు నిర్వహించేవారన్నారు. తాజా నియామకం ఎల్‌డీఎఫ్ ప్రభుత్వ దాష్టీకాన్ని తెలియజేస్తోందన్నారు. ప్రస్తుతం బాలలపై నేరాల శాతం పెరుగుతోందని, అలాంటి కేసుల్లో అత్యధికం పరిష్కారం కావడం లేదన్నారు. కేరళ వాసులు మనోజ్ కుమార్ నియమకాన్ని అంగీకరించబోరని ఆయన స్పష్టం చేశారు.

Advertisement

Next Story