మోడీ, కేసీఆర్ భరతం పడతా : రేవంత్ రెడ్డి

by Shyam |
మోడీ, కేసీఆర్ భరతం పడతా : రేవంత్ రెడ్డి
X

దిశ, మహేశ్వరం: సీఎం కేసీఆర్ బీజేపీలో గల్లీలో కుస్తీ.. ఢిల్లీలో దోస్తీ చేస్తున్నాడనీ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎంపీ రేవంత్ రెడ్డి విమర్శించారు. సోమవారం రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలంలోని దెబ్బడగూడ, కందుకూరు గ్రామాల్లో 9వ రోజు రాజీవ్ రైతు భరోసా యాత్ర కొనసాగింది. దెబ్బడగూడ గ్రామంలో పాదయాత్ర చేస్తూ ఎమ్మెల్యే సీతక్కతో కలిసి పొలాలోకి వెళ్లి రైతులను పలకరించారు. ఈ సందర్భంగా ఎంపీ రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ఢిల్లీలో చాయ్ వాలా, గల్లీలో మందు వాలా దేశాన్ని బంధీగా మార్చారని.. ప్రధాని మోడీ, సీఎం కేసీఆర్ ఇద్దరూ తోడు దొంగలని.. వారి బరతం పడతానన్నారు. దేశానికి అన్నం పెట్టే రైతన్న మూడు నెలల నుంచి ఢిల్లీలో ధర్నా చేస్తుంటే మోడీ, కేసీఅర్ నోరు విప్పకపోవడం బాధాకరమన్నారు. నూతన వ్యవసాయ చట్టాలతో రైతుకు ఒరిగేది ఏమీ లేదని మండిపడ్డారు. రైతుల కళ్లల్లో ఆనందం చూస్తానని చెప్పిన సీఎం కేసీఆర్.. పచ్చని పంట పొలాలను ఫార్మా సిటీ పేరుతో నాశనం చేస్తున్నాడని మండిపడ్డారు. ఫార్మా సిటీ కోసం భూములు ఇచ్చిన రైతులకు ఎకరాకు రూ. 20 లక్షలు నష్టం పరిహారం ఇస్తున్నాడని.. కేసీఆర్ ఫామ్ హౌజ్ లోని 1000 ఎకరాలను అదే రూ. 20 లక్షల చొప్పున అమ్మితే రైతుల పక్షాన నిలబడి 48 గంటల్లో కొంటానన్నారు. ప్రతి నియోజకవర్గంలో లక్ష ఎకరాలకు సాగునీటిని అందిస్తానని చెప్పిన హరీశ్ రావు రాష్ట్రంలో ఏ నియోజక వర్గంలో ఇచ్చాడో చర్చకు సిద్ధమా అని సవాలు విసిరారు.

Advertisement

Next Story