- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా.. టీఆర్ఎస్ ధర్నాకు అనుమతి ఎక్కడిది?
దిశ, జగిత్యాల: టీఆర్ఎస్ ప్రభుత్వానికి రైతుల పట్ల చిత్తశుద్ధి ఉంటే వరిధాన్యం కొనుగోలు చేయాలని, కేంద్రం కొనుగోలు చేయకుంటే వ్యవసాయ ఉత్పత్తులతో ఢిల్లీలోని జంతర్-మంతర్ వద్ద ఎమ్మెల్యే, ఎంపీలతో ధర్నా చేయాలని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. శుక్రవారం జగిత్యాలలో జీవన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. వ్యవసాయ ఉత్పత్తులకు మద్దతు ధర కల్పించాల్సిన బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఉందని అన్నారు. కానీ, బీజేపీ, టీఆర్ఎస్ నేతలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ, తోడు దొంగల్లా రైతులను నట్టేట ముంచుతున్నారని, రైతుల జీవితాలతో చెలగాటమాడుతున్నారని జీవన్ రెడ్డి విమర్శించారు. చివరిగింజ వరకూ కొంటామని చెప్పిన ముఖ్యమంత్రి కేసీఆర్, నేడు కేంద్రం సహకరించడం లేదని చెప్పడం సరికాదని, ఎంపీలతో పార్లమెంట్‌ను స్తంభింపజేయాలని సూచించారు.
వరిని కొనుగోలు చేయడం, మద్దతు ధర కల్పించడం వీలుకాకపోతే రాష్ట్రంలో క్రాఫ్ హాలిడే ప్రకటించి ఎకరానికి 20 వేలు రైతులకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా కాంగ్రెస్ పార్టీ ఒక్కటే రైతుల పక్షాన నిలబడుతుందని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు లక్ష్మణ్, కుమార్, మున్సిపల్ కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ దుర్గయ్య, మాజీ మున్సిపల్ చైర్మన్ నాగభూషణం, మాజీ వైస్ చైర్మన్ మన్సురి అలీ, ఎంపీటీసీ సుధాకర్, కాంగ్రెస్ నాయకులు శంకర్, రాజేందర్, నందయ్య, రాజేందర్, రమేశ్ బాబు, అశోక్, రాధాకిషన్, విజయ్, నెహాల్, మహిపాల్, మొగిలి, గంగారెడ్డి పాల్గొన్నారు.
టీఆర్ఎస్ ధర్నాకు కలెక్టర్ అనుమతి ఉందా?
రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమలులో ఉందని, జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఆర్డీఓ ఆఫీసు ఎదుట జాతీయ రహదారిని నిర్బంధించి టీఆర్ఎస్ ధర్నా చేయడానికి కలెక్టర్ అనుమతి ఇచ్చారా? లేదా? అన్న అనుమానం ప్రజల్లో ఉందని, దీనిపై కలెక్టర్ క్లారిటీ ఇవ్వాలని జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు. అంతేగాకుండా.. ఆర్డీఓ ఆఫీసు ఎదుట ధర్నా కోసం రాత్రి వేళల్లో పోలీసులు దగ్గరుండి టెంట్లు వేయించడమేంటని, పోలీసులే టీఆర్ఎస్ ధర్నాకు రక్షణ కల్పిస్తున్నారా, శాంతి భద్రతలు ఏమయ్యాయని ప్రశ్నించారు. ఈ విషయాన్ని రాష్ట్ర ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్తానని జీవన్ రెడ్డి హెచ్చరించారు.