‘పదవి కాపాడుకునే ప్రయత్నంలో హరీశ్‌రావు’

by Shyam |
‘పదవి కాపాడుకునే ప్రయత్నంలో హరీశ్‌రావు’
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ రాజకీయం మొత్తం దుబ్బాక ఎన్నికల చుట్టే తిరుగుతోంది. అధికార-ప్రతిపక్ష నేతలు ఒకరి పై మరొకరు తీవ్ర విమర్శలు, సవాళ్లు విసురుకుంటూ రాష్ట్రంలో రాజకీయ సెగపుట్టించారు. ఇప్పటికే బీజేపీ-టీఆర్ఎస్ మధ్య టగ్ ఆఫ్ వార్ వాఖ్యలు నడుస్తున్నాయి. ఇక దీనికి తోడు కాంగ్రెస్ లీడర్ జగ్గారెడ్డి కామెంట్స్‌ మరింత హీట్ ఎక్కిస్తున్నాయి.

దుబ్బాక పరిధి వేములఘట్‌లో ఎన్నికల ప్రచారం చేసిన జగ్గారెడ్డి.. ప్రజల సమస్యలను ప్రశ్నించే కాంగ్రెస్ నేతలను ఓటు వేయాలన్నారు. ఈ సందర్భంగానే మంత్రి హరీశ్‌ రావు సవాల్‌ పై స్పందించిన జగ్గారెడ్డి దుబ్బాక ఎన్నికలో ఓడిపోతే హరీశ్ రావు మంత్రి పదవి, ఎమ్మెల్యే సీటు రెండూ ఉండవన్నారు. కేవలం తన మంత్రి పదవిని కాపాడుకునేందుకు హరీశ్ రావు ప్రయత్నాలు చేస్తున్నారని జగ్గారెడ్డి విమర్శలు చేశారు.


👉 Follow us on WhatsApp Channel
👉 Follow us on Sharechat


Next Story

Most Viewed