3000 బూతులకు 10 లక్షలు.. పోటీపడుతున్న నేతలు

by Sridhar Babu |
Congress-Leaders1
X

దిశ ప్రతినిధి, రంగారెడ్డి: ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో కాంగ్రెస్ పార్టీ కంచుకోటగా ఉండేది. కాలక్రమేణ జరుగుతున్న పరిణామాలతో రాజకీయాలు మారుతున్నాయి. అందుకు అనుగుణంగా నాయకులు పార్టీలు మారుతున్నారు. ఉమ్మడి ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో టీడీపీ, కాంగ్రెస్ పార్టీలు నువ్వా నేనా అనే విధంగా రంగారెడ్డి జిల్లాలో రాజకీయం చేశాయి. అంతేకాకుండా ఆ పార్టీలు బద్ధ శత్రువులుగా కనిపించేవారు. అధికార కార్యక్రమం చేపడితే అధికార పార్టీ ఎమ్మెల్యే ఉంటే ప్రొటోకాల్, ప్రతిపక్ష ఎమ్మెల్యే ఉంటే అంతే సంగతులు… ఒకవేళ అధికార, ప్రతిపక్ష పార్టీల నేతలు అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొంటే రచ్చరచ్చ జరిగేది. ఇప్పుడు అభివృద్ది మాట అటు ఉంచితే… పాలన జరిగే తప్పిదాలను ప్రశ్నించాలంటే ప్రతిపక్ష పార్టీ నేతలకు బలం సరిపోవడం లేదు. అంతేకాకుండా అధికార, ప్రతిపక్ష నేతలు తమ వ్యక్తిగత స్వార్థం కోసం కలిసిపోయి కార్యకర్తలను బలి పశువులుగా మారుస్తున్నారు. ఈ విషయం గమనించిన కార్యకర్తలు సైలెంట్ గా ఉండటం, అధికార పార్టీ పంచన చేరిపోవడం జరుగుతుంది. ఒకప్పుడు బద్ధ శత్రువులుగా జిల్లాలో రాజకీయం చేసిన కాంగ్రెస్, టీడీపీ నేతలు నేడు ఒకే వేదికపై ఉండి అధికార టీఆర్ఎస్ పార్టీలో పనిచేయడం విశేషం. ఇలాంటి పరిస్థితిల్లో కాంగ్రెస్ తమ ప్రభావం చూపుతుందా అనే అనుమానం రాజకీయా మేధావుల్లో చర్చ సాగుతుంది.

రెండు జిల్లాలో 10లక్షల సభ్వత్వంగా లక్ష్యం….

నాలుగున్నర కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చిన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ జన్మదినం గురువారం నుంచి సభ్యత్వానికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా భారీగా సభ్వత్వం కార్యక్రమం చేపట్టాలని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఆదేశాలు జారీ చేసింది. అందులో భాగంగానే జిల్లాల వారీగా లక్ష్యాలను నిర్ధేశించారు. రంగారెడ్డి జిల్లాలో 3000 బూతులు, వికారాబాద్ జిల్లాలో 2వేలకు పైన బూతులున్నాయి. ప్రతి బూతు నుంచి కనీసం 200 మంది సభ్యత్వం చొప్పున చేయాలని లక్ష్యంగా అడుగులు వేస్తున్నారు. రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలు కలిపి మొత్తం 10లక్షలకు పైగా సభ్వత్వం చేయాలనే టార్గెట్ తో ముందుకు పోతున్నారు. అయితే ఈ టార్గెట్ లో ఆయా నియోజకవర్గంలోని పలువురు నేతలు పోటీ పడుతున్నారు. ఈ పోటీ మహేశ్వరం, ఇబ్రహీంపట్నం, చేవెళ్ల, షాద్ నగర్, వికారాబాద్, పరిగి అసెంబ్లీ పరిధిలో కనిపిస్తుంది.

సభ్వత్వంలో దూసుకపోతున్నవాళ్లేకే అవకాశమా…?

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఆదేశాలతో సభ్యత్వ కార్యక్రమంలో నిమగ్నమైన నేతలకు భవిష్యత్తు ఉంటుందా అంటే అవుననే సమాధానం వస్తుంది. అందుకోసం ఆయా నియోజకవర్గాల్లో అసెంబ్లీ టికెట్ ఆశిస్తున్న నేతలు సభ్యత్వ కార్యక్రమంలో నిగమ్నమైనట్లు తెలుస్తోంది. చేవెళ్ల, మహేశ్వరం, ఇబ్రహీంపట్నం, షాద్ నగర్ నియోజకవర్గాల్లో అసెంబ్లీ టికెట్ కోసం పోటిపడుతున్న నేతలు అత్యధికంగా ఉన్నారు. వీరందరూ సభ్యత్వం చేసి చూపించాలనే లక్ష్యంతో పనిచేస్తున్నారు.

Advertisement

Next Story