ఇది ఎంతవరకు సమంజసం: ప్రేమ్ సాగర్

by Shyam |
ఇది ఎంతవరకు సమంజసం: ప్రేమ్ సాగర్
X

దిశప్రతినిధి, ఆదిలాబాద్: ప్రజారోగ్య పరిరక్షణలో ప్రభుత్వం పూర్తిగా విఫలం అయిందని ఏఐసీసీ కార్యదర్శి ప్రేమ్ సాగర్ రావు విమర్శించారు. బుధవారం మంచిర్యాలలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజలకు ప్రభుత్వ దవాఖానాలు… మంత్రులు, ఎమ్మెల్యేలకు కార్పొరేట్ దవాఖానాలు ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు. జిల్లాలో నిబంధనలకు విరుద్ధంగా అభివృద్ధి పనుల పేరిట నిధుల దుర్వినియోగం జరుగుతున్నదని ఆరోపించారు. ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పోరాటం చేస్తుందని ప్రకటించారు. మంచిర్యాల జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు సురేఖ పాల్గొన్నారు.

Next Story

Most Viewed