క్రికెట్‌లో ఓడిపోతే గెలవచ్చు.. రాజకీయాల్లో అలా కాదు: అజారుద్దీన్

by Aamani |   ( Updated:2021-09-13 08:10:14.0  )
క్రికెట్‌లో ఓడిపోతే గెలవచ్చు.. రాజకీయాల్లో అలా కాదు: అజారుద్దీన్
X

దిశ, కామారెడ్డి: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం సృష్టిస్తుందని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ అజారుద్దీన్ అన్నారు. సోమవారం మాచారెడ్డి మండల కేంద్రంలో దళిత గిరిజన ఆత్మగౌరవ సభలో భాగంగా.. ఏర్పాటు చేసిన మండల కార్యకర్తల సమావేశంలో అజారుద్దీన్, మాజీ మంత్రి షబ్బీర్ అలీలు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా అజారుద్దీన్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ బడుగు బలహీన వర్గాల పార్టీ అని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ హయాంలోనే అభివృద్ధి జరిగిందని పేర్కొన్నారు. క్రికె‌ట్‌లో ఓడిపోతే తర్వాత జరిగే మ్యాచ్‌లో గెలుస్తామని, ఎన్నికల్లో ఓడిపోతే మాత్రం ఐదేళ్ల వరకు మళ్ళీ గెలిచే అవకాశం ఉండదన్నారు. కామారెడ్డి, మాచారెడ్డిలో క్రికెట్ టోర్నమెంట్ పెడితే పెద్ద పెద్ద క్రికెటర్లను తీసుకువచ్చి.. ఇక్కడి యువతకు శిక్షణ ఇచ్చేలా చూస్తానని హామీ ఇచ్చారు.

షబ్బీర్ అలీ మాట్లాడుతూ.. టీఆర్ఎస్ నాయకులు రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని ఆరోపించారు. మొన్నటిదాకా మీకు సరైన నాయకుడే లేరని అరిచిన టీఆర్ఎస్ నాయకులు.. రేవంత్ రెడ్డి రాకతో వారి గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయన్నారు. కాంగ్రెస్ హయాంలో పేదలకు ఇచ్చిన పోడు భూములను అధికారులు లాక్కుంటున్నారని.. మళ్ళీ కాంగ్రెస్ అధికారంలోకి రాగానే లాక్కున్న భూములను తిరిగి ఇస్తామని చెప్పారు. రైతులు పండించే ధాన్యాన్ని ప్రభుత్వం కొనాల్సిందేనని, లేకపోతే ప్రగతిభవన్‌ను ముట్టడిస్తామని షబ్బీర్ అలీ హెచ్చరించారు.

Advertisement

Next Story

Most Viewed