- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అసెంబ్లీ నుంచి వాకౌట్ చేసిన కాంగ్రెస్ నేతల మాటలు విన్నారా..?
దిశ, తెలంగాణ బ్యూరో : ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తోందని, శాసన సభలో మాట్లాడే అవకాశం ఇవ్వకుండా ప్రతిపక్షాల గొంతు నొక్కేస్తున్నదని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆగ్రహం వ్యక్తం చేశారు. శాసనసభ నుంచి బుధవారం వాకౌట్ చేసిన అనంతరం గన్ పార్క్ వద్ద మీడియాతో మాట్లాడారు. ఇప్పటికే 12 మంది ఎమ్మెల్యేలను అప్రజాస్వామికంగా టీఆర్ఎస్‌లో కలుపుకున్నారని విమర్శించారు. రాష్ట్రంలో ప్రతిపక్షం ఉండకూడదని ప్రభుత్వం భావిస్తోందని దుయ్యబట్టారు. రాష్ట్ర శాసనసభలో ప్రజాసమస్యలపై మాట్లాడేందుకు ప్రభుత్వం అవకాశం ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అధికార పక్షం నియంత వైఖరిని నిరసిస్తూ సభ నుంచి కాంగ్రెస్ శాసనసభా పక్షం వాకౌట్ చేసిందన్నారు.
ప్రజాస్వామ్య స్ఫూర్తి లేకుండా కనీసం నిరసన తెలిపేందుకు మైక్ ఇవ్వకుండా.. అడ్డుకోవడం ఏమిటని ప్రశ్నించారు. ఎటువంటి అప్రజాస్వామిక వ్యాఖ్యలు చేయకపోయినా, సభకు తాము క్షమాపణ చెప్పాలని మంత్రులు అంటున్నారని, తమ గొంతు నొక్కడానికి చేస్తున్న ప్రయత్నంలోని భాగమేని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ భజనతోనే సభ నడవాలని సర్కారు కోరుకుంటున్నదని, ఇది ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని ఆగ్రహం వ్యక్తం చేశారు. పెరుగుతున్న ధరలు, ప్రజా సమస్యలు, లా అండ్ ఆర్డర్‌పై ప్రభుత్వాన్ని తాము ప్రశ్నించాలనుకోవడం తప్పా.. అని ప్రశ్నించారు.
ప్రతిపక్ష గొంతు నొక్కుతున్నారు : ఎమ్మెల్యే శ్రీధర్ బాబు
సంఖ్యా బలంతో సభలో అధికార పక్షం ప్రతిపక్షాన్ని గొంతు నొక్కేస్తున్నదని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు అమలవుతున్నాయా అని ప్రశ్నించారు. నడిరోడ్డుపై అడ్వకేట్ దంపతులను హత్య చేశారని, సభలో దీనిపై మాట్లాడేందుకు అవకాశం ఇవ్వడం లేదన్నారు. స్పీకర్ సభ్యులందరినీ సమానంగా చూడాలని కోరారు. మంత్రులు హరీశ్ రావు, ప్రశాంత్ రెడ్డి తీరును ఖండిస్తున్నామన్నారు.
నియంత పాలనలో ఉన్నామా? : ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి
మనం ఉన్నది ప్రజాస్వామ్యంలోనా? నియంత పాలనలోనా? అనే సందేహం వస్తోందని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ప్రశ్నించారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేలను కొనుక్కొని.. ఇప్పుడు తమ సభ్యుల సంఖ్యా బలం లేదని చెబుతున్నారని విమర్శించారు. కేసీఆర్ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల సమస్యలపై మాట్లాడే అవకాశం ఇవ్వకుండా.. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.