- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘వాళ్లకు ఉచితంగా నాణ్యమైన వైద్యం అందించండి’
దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో కోవిడ్‌బారినపడి చాలా కుటుంబాలు ఆగమవుతున్నాయని, పేదలకు వైద్యం అందించడంలో ప్రభుత్వాలు విఫలమవుతున్నాయని టీపీసీసీ చీఫ్, నల్లగొండ ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వాలు ప్రజలకు ఉచితంగా వైద్య సేవలు అందించడం కనీస ప్రాథమిక బాధ్యత అని గుర్తుచేశారు. కరోనాతో చికిత్స పొందుతున్న ఉత్తమ్… ఏఐజీ ఆసుపత్రి నుంచి గురువారం వీడియో సందేశం పంపించారు. కరోనాను ఆరోగ్య శ్రీ పథకంలో చేర్చాలని, పేదలకు ఉచితంగా నాణ్యమైన వైద్యం అందించాలని కోరారు.
తన ఆరోగ్యం గురించి ప్రార్థించిన స్నేహితులు, శ్రేయోభిలాషులు, కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు ప్రతి ఒక్కరికీ పేరు పేరునా కృతజ్ఞతలు తెలుపుతున్నామని, అందరి దీవెనలతో రెండు మూడు రోజులలో ఇంటికి డిశ్చార్జ్ అవుతానని ఆశాభావం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు కరోనా బాధితుల కోసం గాంధీ భవన్‌తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి సేవలు చేస్తున్నారని, ఈ సమయంలో అండగా ఉంటున్న వారందరికీ అభినందనలు తెలిపారు. పేద ప్రజలు కరోనా బారిన పడి వైద్య సేవలు అందాక నానా కష్టాలు పడుతున్నారని, బెడ్లు, రెమిడిసివర్ ఇంజక్షన్లు దొరక్కపోవడం అత్యంత బాధాకరమని, హాస్పిటల్స్‌లో బెడ్స్, ఆక్సిజన్, వెంటిలేటర్స్, రెమిడిసివర్ ఇంజెక్టన్లు ఇప్పించాలని తమకు ఫోన్లు వస్తున్నాయని, దీనిపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని సూచించారు.