- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘మేము అధికారంలోకి వచ్చాక వడ్డీతో సహా చెల్లిస్తాం’..
దిశ ప్రతినిధి, వరంగల్: జనగామ డీసీసీ అధ్యక్షుడు జంగా రాఘవరెడ్డిని పోలీసులు అరెస్ట్ చేయడం వెనుక మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు హస్తం ఉందని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి నమిండ్ల శ్రీనివాస్ అన్నారు. శుక్రవారం వరంగల్ డీసీసీ భవన్‌లో అధ్యక్షుడు నాయిని రాజేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ నాయకులపై టీఆర్ఎస్ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగుతోందని ఆరోపించారు. పాలకుర్తి నియోజకవర్గంలో పోటీకి నిలబడినందుకే జంగా రాఘవరెడ్డిని ఎర్రబెల్లి దయాకర్‌రావు ఇబ్బందులకు గురి చేస్తున్నారని చెప్పారు.
వరంగల్ జిల్లాలో బలమైన కాంగ్రెస్ నేతలుగా ఉన్న జంగా, నాయిని వంటి వారిపై కేసులు మోపుతున్నట్లు ఆరోపించారు. ఏమాత్రం విలువలు పాటించకుండా ఎర్రబెల్లి రాజకీయ వ్యభిచారిగా మారారని ధ్వజమెత్తారు. తాము మొదటి నుంచి ఒకే పార్టీలో ఉన్నామని, ‘‘ఒక అయ్యకు పుట్టినోడు పార్టీ మారడు’’ అని వ్యాఖ్యనించిన మంత్రి ఎర్రబెల్లి ఇప్పుడు తానేంటో ఆలోచించుకోవాలన్నారు. టీఆర్ఎస్ పాలన చూస్తుంటే రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా లేదా? అన్న అనుమానం కలుగుతోందన్నారు. కావాలనే జంగా రాఘవ రెడ్డిని అక్రమ కేసుల్లో ఇరికించారని మండిపడ్డారు. కొంతమంది పోలీసులు అధికార పార్టీ నేతలు చెప్పినట్లుగా నడుచుకోవడం వల్లే ఇది సాధ్యమవుతోందన్నారు. అధికారం ఉందని ఎగిసిపడవద్దని, తాము అధికారంలోకి వచ్చినప్పుడు వడ్డీతో సహా టీఆర్ఎస్ నాయకులకు చెల్లిస్తామని హెచ్చరించారు.