ప్రధానికి ప్రచారంపై ఉన్న శ్రద్ధ ప్రజారోగ్యం మీద లేదు : పొన్నం

by Sridhar Babu |
ప్రధానికి ప్రచారంపై ఉన్న శ్రద్ధ ప్రజారోగ్యం మీద లేదు : పొన్నం
X

దిశ, కరీంనగర్ సిటీ : ప్రధాని మోదీకి ప్రచారం పట్ల ఉన్న శ్రద్ధ ప్రజల ఆరోగ్యంపై లేదని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కార్యనిర్వాహక అధ్యక్షుడు పొన్నం ప్రభాకర్ అన్నారు. దేశంలో కల్లోలం సృష్టిస్తున్న కరోనా మహమ్మారిని నివారించే ప్రయత్నం చేయకపోగా, చేపట్టాల్సిన జాగ్రత్తలు తీసుకోవటం లేదని మండిపడ్డారు. దేశంలో ఆక్సిజన్ కొరత, రెమిడిసివిర్ ఇంజెక్షన్లు, వ్యాక్సిన్లు అందుబాటులో లేక జనం అల్లాడుతుంటే చోద్యం చేస్తుండటం శోచనీయమన్నారు.

ప్రజలు తమ డబ్బులతో వ్యాక్సిన్లు తీసుకుంటే ఇచ్చే ధ్రువీకరణ పత్రాలపై తన ఫోటో వేయించుకోవడం ఏ మేరకు సమంజసమని ప్రశ్నించారు. దేశ ప్రజలందరికీ ఉచితంగా అందించాల్సిన వ్యాక్సిన్ పేద మధ్యతరగతి ప్రజలకు కూడా 1,000 నుంచి 1500కు విక్రయించటం కేంద్ర ప్రభుత్వ వ్యాపార ధోరణిని తేటతెల్లం చేస్తుందన్నారు. ఇప్పటికైనా కోవిడ్ వ్యాక్సిన్‌ను దేశ ప్రజలందరికీ ఉచితంగా పంపిణీ చేయాలని మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో కోరారు.

Advertisement

Next Story

Most Viewed