- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
చర్చకు వచ్చే ధైర్యముందా.. రసమయికి ‘మధుకర్’ ఓపెన్ సవాల్
దిశ, మానకొండూరు : మానకొండూర్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ప్రజాక్షేత్రంలో చర్చకు సిద్ధమా.? అని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి ఊకటి మధుకర్ సవాల్ విసిరారు. శుక్రవారం శంకరపట్నం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మధుకర్ మాట్లాడారు.
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటై ఎనిమిది సంవత్సరాలు గడిచినా, మానకొండూరు నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదు. ప్రజాక్షేత్రంలో శంకరపట్నం మండల కేంద్రంలో చర్చకు సిద్ధమా అని కౌంటర్ విసిరారు. ఎనిమిదేండ్లలో నియోజకవర్గంలో ఎన్ని డబుల్ బెడ్ రూమ్‌లు ఇచ్చారు. దళితులకు 3 ఎకరాల భూమి ఎంతమందికి ఇచ్చారు.
పూర్తిగా ప్రభుత్వం ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటీ నెరవేర్చకుండా కాంగ్రెస్ నాయకులు ప్రతిపక్ష హోదాలో ఉండి ప్రశ్నిస్తే.. తప్పుడు ఆరోపణలు అంటూ టీఆర్ఎస్ పార్టీ నాయకులు మాట్లాడటం సరికాదని హితవు పలికారు. మానకొండూరు ఎమ్మెల్యేగా ఆరు మండలాల్లో ప్రభుత్వ సంక్షేమ పథకాలను ఎంతమందికి ఇచ్చారు.
ప్రజాక్షేత్రంలో చర్చకు సిద్ధమా.? అని మానకొండూరు ఎమ్మెల్యేతోపాటు, టీఆర్ఎస్ నాయకులకు, కార్యకర్తలకు.. మధుకర్ సవాల్ విసిరారు. ఇప్పటికైనా తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో జిల్లా నాయకులు ఉప్పుగల్ల మల్లారెడ్డి, మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు.