- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తాను కీలుబొమ్మను కాదంటూ.. రాహుల్‌కు కుష్బూ షాక్
దిశ, వెబ్‌డెస్క్: నూతన విద్యావిధానంపై రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ నేత, నటి కుష్బూ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయంతో తాను పూర్తిగా విభేదిస్తున్నానని ఆమె స్పష్టంచేశారు. ఈ వ్యాఖ్యలు చేసే కంటే ముందు రాహుల్ గాంధీకి సారీ చెప్పారు. తాను ఉన్నది ఉన్నట్లు మాట్లాడతానని చెప్పుకొచ్చారు. తాను రోబోను కాను.. కీలు బొమ్మను అసలే కాను అంటూ తనదైన తరహాలో వాయిస్ పెంచారు.
ప్రతి విషయంలోనూ అధిష్ఠానానికి తలూపాల్సిన పని లేదని.. ఓ సాధారణ పౌరురాలిగా తన వైఖరి తాను చెప్పానని.. మిగతా వారు కూడా ధైర్యంతో మీ వైఖరి చెప్పుకోవచ్చన్నారు. కేంద్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన విద్యా విధానాన్ని ఆమె స్వాగతించారు. అయితే, ఇదికేవలం తన వ్యక్తిగత అభిప్రాయమని, పార్టీకి ఏమాత్రం సంబంధం లేదని ఆమె స్పష్టం చేశారు.
ఇదిలావుంటే సౌత్ ఇండియా నుంచి కాంగ్రెస్ పార్టీకి వెన్నుదన్నుగా నిలిచే కుష్బూ ఒక్కసారిగా ఇలాంటి కామెంట్ చేయడంతో పార్టీ నేతలు అవాక్కయ్యారు. అందులోనూ రాహుల్ గాంధీని ఉద్దేశించి మాట్లాడటంతో నేతలంతా దిక్కుతోచని స్థితిలో పడిపోయారు.