- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అసెంబ్లీలో కాంగ్రెస్ అవిశ్వాస తీర్మానం
by Shamantha N |
X
దిశ, చండీగఢ్: హర్యానా అసెంబ్లీలో మనోహర్ లాల్ ఖట్టార్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రతిపక్ష కాంగ్రెస్ అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. ఈ తీర్మానాన్ని అసెంబ్లీ స్పీకర్ గ్యాన్ చాంద్ గుప్తా ఆమోదించారు. మార్చి 10న అవిశ్వాస తీర్మానంపై చర్చించనున్నట్టు వెల్లడించారు. హర్యానా అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాలు శుక్రవారం మొదలయ్యాయి. తొలి రోజే ప్రతిపక్ష కాంగ్రెస్, ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. మాజీ సీఎం భూపిందర్ సింగ్ హుడా సహా 25 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. దీనిపై సీఎం మనోహర్ లాల్ ఖట్టార్ స్పందిస్తూ ప్రభుత్వానికి వచ్చిన ముప్పేమీ లేదని అన్నారు. కేవలం కాంగ్రెస్ ఎమ్మెల్యేల బలాన్ని చూసుకోవడానికే ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టారని వ్యంగ్యంగా స్పందించారు.
Advertisement
Next Story