- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
గాల్వన్ లోయ ఘటనపై చర్చించాలి: కాంగ్రెస్
న్యూఢిల్లీ: గాల్వన్ లోయ ఘటన లాంటి ముఖ్యమైన అంశాలపై చర్చించడానికి పార్లమెంట్ వర్చువల్ సమావేశాలను కేంద్రం నిర్వహించాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. ఏ సమస్యనైనా చర్చించి ఒక వ్యూహాన్ని రూపొందించుకోవడానికి పార్లమెంట్ చర్చలే ఉన్నతమైన మార్గమని వివరించింది. గాల్వన్ లోయ, పాంగాంగ్ లేక్ ఏరియాలో చైనా కొత్తగా నిర్మాణాలు చేపడుతున్నట్టు శాటిలైట్ చిత్రాలు వివరిస్తున్నాయని, చైనా కవ్వింపు చర్యలు శృతి మించాయని వ్యాఖ్యానించింది. ఈ పరిస్థితులను ఎదుర్కోవడానికి కేంద్రం అనుసరిస్తు్న్న ప్రణాళికలను వివరించాలని కోరింది. చైనాతో కఠినంగా వ్యవహరించాలని చిదంబరం, అధిర్ రంజన్ చౌదరి సహా పలువురు కాంగ్రెస్ నేతలు అభిప్రాయపడ్డారు.
చైనా విదేశాంగ శాఖ, ఆ దేశ ఆర్మీ గాల్వన్ లోయ వారిదేనని పునరుద్ఘాటించాయని, భారత సైన్యం అక్కడి నుంచి వెళ్లిపోవాలని సూచించిందని కేంద్ర మాజీ మంత్రి పి చిదంబరం ట్వీట్ చేశారు. ఇది అసాధారణమైన డిమాండ్ అని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం మరోసారి తన వాదనలను వినిపించగలదా? సరిహద్దులో యథాతథా స్థితిని తిరిగి నెలకొల్పాని డిమాండ్ చేయగలదా? అని ప్రశ్నించారు. ఇందులో మోడీ ప్రభుత్వం విజయవంతమవుతుందా? లేదా? అని ప్రజలు చూస్తున్నారని ట్విట్టర్‌లో పేర్కొన్నారు. చైనా సైన్యం గాల్వన్ లోయలోకి చొచ్చుకొచ్చినట్టు ఉపగ్రహ చిత్రాలు వెల్లడిస్తున్నాయని, చైనా కవ్వింపులు నిజమే అయితే, దీనిపై ప్రధాని మోడీ, రక్షణ మంత్రి ఏమంటారని కాంగ్రెస్ ప్రతినిధి రణదీప్ సుర్జేవాలా ప్రశ్నించారు. సరిహద్దులో శాంతి కోసం ఎన్ని ఒప్పందాలు చేసుకున్న యథాతథ స్థితిని మార్చడానికి శాయశక్తలు ప్రయత్నిస్తున్నదని అధిర్ రంజన్ చౌదరి అభిప్రాయపడ్డారు.