- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
దేశానికి ప్రధాని మోడీ క్షమాపణలు చెప్పాలి: కాంగ్రెస్
దిశ, వెబ్‌డెస్క్: ప్రధాని నరేంద్ర మోడీ దేశానికి క్షమాపణలు చెప్పాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. భారత భూభాగంపై ఎవ్వరూ అడుగుపెట్టలేదని, ఒక్క మిలిటరీ పోస్టునూ ఎవ్వరూ స్వాధీనం చేసుకోలేదని ప్రధాని దేశానికి అబద్ధం చెప్పారని గుర్తుచేసింది. గాల్వన్ నుంచి చైనా ట్రూపులు వెనక్కి మళ్లుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం లడాఖ్‌లో నెలకొన్న పరిస్థితులను ప్రధాని మోడీ గానీ లేదా రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ గానీ దేశానికి వివరించాలని కాంగ్రెస్ ప్రతినిధి పవన్ ఖేరా డిమాండ్ చేశారు. ధైర్య సాహసాలు చేయగల సత్తా ఉన్న భారత ఆర్మీ చైనా పీఎలఏను వెనక్కి మళ్లించే ప్రయత్నాలు చేస్తున్నదని, ఆ వార్తలు సంతోషాన్నిస్తున్నాయని ఆయన తెలిపారు. భారత ఆర్మీ పట్ల గర్వంగా ఉన్నదని, వారి సామర్థ్యంపై అనుమానాలేవీ లేవని చెప్పారు. ఎదురుగా ఉన్నది పాకిస్తాన్ సైన్యమైనా, చైనా సైన్యమైనా వెన్నుచూపకుండా నిలిచి పోరాడిన చరిత్ర భారత ఆర్మీకి ఉన్నదని వివరించారు.