సమస్యల వలయంలో చిగురుమామిడి.. గ్రామసభ రసాభాస

by Sridhar Babu |
సమస్యల వలయంలో చిగురుమామిడి.. గ్రామసభ రసాభాస
X

దిశ, చిగురుమామిడి : చిగురుమామిడి మండల కేంద్రంలో సర్పంచ్ బెజ్జంకి లక్ష్మణ్ ఆధ్వర్యంలో మంగళవారం గ్రామసభ జరిగింది. ప్రతీ రెండు నెలలకు ఒకసారి జరిగే గ్రామసభ ఈసారి గందరగోళంగా మారింది. గ్రామంలో ఉన్న సమస్యలను సర్పంచ్, కార్యదర్శి, పంచాయతీ సిబ్బంది పట్టించుకోవడంలేదని గ్రామస్తులు సభలో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వార్డుల్లో ఉన్న సమస్యలను గ్రామస్తులు ప్రతీసారి జరిగే గ్రామసభలో చెబుతున్నప్పటికీ పాలకులు మాత్రం పట్టించుకోవడంలేదని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

గ్రామంలో కుక్కలు, పందులు, కోతులు ఉన్నాయని ఎన్నోరోజులుగా చెబుతున్నప్పటికీ సమస్యలు పరిష్కారం కావడం లేదని ఫైరయ్యారు. డ్రైనేజీలు, కాలనీల్లోని చెత్తాచెదారం తొలగించడం లేదన్నారు. గ్రామంలో త్రాగునీటి సమస్యను తొలగించాలని డిమాండ్ చేశారు. హుస్నాబాద్-కరీంనగర్ ప్రధాన రహదారిపై ఉన్న దుకాణానికి పర్మిషన్ ఇవ్వవద్దని కాలనీవాసులు తెలిపారు. అక్కడ తాము ఎన్నో సంవత్సరాలుగా ఉన్నామని మహిళలు కోరారు. కాగా గ్రామసభకు హాజరు కావాల్సిన వివిధ శాఖల అధికారులు ఎందుకు రావడంలేదని ప్రశ్నించారు.

Advertisement

Next Story

Most Viewed