ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలి

by Shyam |
ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలి
X

దిశ, తెలంగాణ బ్యూరో: మురుగు నీరుపై ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని జలమండలి ఎండీ దాన కిశోర్ అధికారులను ఆదేశించారు. ఆదివారం అధికారులతో నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్‌లో మాట్లాడుతూ అత్యవసర పరిస్థితుల్లో సేవలకు అదనంగా 700మంది సిబ్బంది నియామకం, కార్యకలాపాలు చేపట్టే డివిజన్ జీఎంలకు రూ.1.20కోట్లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. మ్యాన్ హోల్‌ల వద్ద పారుతున్న సీవరేజ్ ఓవర్ ఫ్లో సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని సూచించారు. పారిశుధ్య కార్మికులు.. మాస్కులు, హెల్మెట్ వంటి రక్షణ పరికరాలను విధిగా ధరించాలని, విధుల్లో ఏవైనా ఇబ్బందులు తలెత్తితే వెంటనే అధికారుల దృష్టికి తీసుకురావాలని తెలిపారు. రిజర్వాయర్ల శుద్ధి, మరమ్మతులు చేయడానికి, రిజర్వాయర్ ప్రాంగణాలు శుభ్రపరచడానికి అదనంగా మరో రూ. 50లక్షలు, ఓఆర్ఆర్ రిజర్వాయర్లు శుద్ధి చేయడానికి మరమ్మతులకు ఒక్కో జీఎంకు రూ. 5లక్షలు మంజూరు చేసినట్లు వెల్లడించారు.

Advertisement

Next Story

Most Viewed