- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కేటీఆర్‌పై మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు
దిశ, తెలంగాణ బ్యూరో: వికలాంగులను అవమానించేలా, వారి మనోభావాలు దెబ్బతినేటట్లు మాట్లాడుతున్న టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ వికలాంగుల విభాగం చైర్మన్ ముత్తినేని వీరయ్య మానవ హక్కుల కమిషన్ ను కోరారు. గురువారం తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ లో కేటీఆర్ పై ఫిర్యాదు చేశారు. పలుసార్లు ‘గుడ్డి గుర్రాల పండ్లు తోముతున్నారా? గుడ్డి ద్వేషం ఎందుకు?’ అనే పదాలు వాడారన్నారు. టీవీ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూ లో ఈ పదాలు వాడినట్లు చెప్పారు. తెలంగాణలోని వికలాంగుల మనోభావాలు కించపరిచారని, వారందరూ ఆత్మన్యూనతా భావానికి లోనయ్యేలా ప్రవర్తించిన మంత్రి కేటీఆర్ పై చర్యలు తీసుకోవాలని ప్రపంచ మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా కోరారు.
మానవ హక్కుల కమిషను తమ ఫిర్యాదును స్వీకరించి విచారణకు శుక్రవారం మధ్యాహ్నం మూడు గంటలకు రమ్మన్నట్లు చెప్పారు. మంత్రి స్థాయిలో వికలాంగుల హక్కుల చట్టాలను గౌరవించి, అమలు పర్చాల్సిన స్థానంలో ఉండి తన బాధ్యతను మర్చిపోయినట్లు చెప్పారు. కేటీఆర్ కు సంస్కారం లేదని ఆరోపించారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత వికలాంగుల సంక్షేమ శాఖను నిర్వీర్యం చేశారని, వికలాంగులను అన్నీ రకాలుగా అనగా దొక్కుతున్నారన్నారు. బయటికేమో వికలాంగులకు కేసీఆర్ కొండంత అండ అంటూ ప్రగల్భాలు పలుకుతున్నట్లు చెప్పారు. కేటీఆర్ మాటలు వికలాంగుల హక్కుల చట్టం 2016, సెక్షన్ 92 కింద నేరమని పేర్కొన్నారు.