- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పంజాగుట్ట పీఎస్ వద్ద ఉద్రిక్తత.. పోసానిపై ఫిర్యాదు
దిశ, ఖైరతాబాద్: ప్రముఖ సినీ నటుడు పోసాని కృష్ణ మురళి జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో జనసేన పార్టీ తెలంగాణ అధ్యక్షుడు శంకర్ గౌడ్ ఫిర్యాదు చేశారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో పవన్‌తో పాటు ఆయన కుటుంబ సభ్యులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన పోసానిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పంజాగుట్ట పోలీసులను ఆశ్రయించారు. జనసేన లీగల్ టీం నేతృత్వంలో రూపొందించిన ఫిర్యాదు కాపీని అధ్యక్షుడు శంకర్ గౌడ్ ఎస్ఐ కౌశిక్‌కు అందజేశారు. అనంతరం శంకర్ గౌడ్ మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం పోసానిని బహిష్కరించాలని కోరారు. సభ్య సమాజం సిగ్గుపడేలా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయని మండిపడ్డారు. పోసాని ప్రవర్తన మార్చుకోకుంటే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించారు.
పంజాగుట్ట పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత
పోసాని ప్రెస్‌మీట్‌ను అడ్డుకునేందుకు వచ్చినవారిని పోలీసులు అరెస్టు చేసి పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ విషయం తెలుసుకున్న పవన్ అభిమానులు, జనసేన నాయకులు అక్కడికి చేరుకోవడంతో పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. పోసానికి వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో పాటు దేవుడులాంటి పవన్ కల్యాణ్‌పై అనవసర విమర్శలు చేస్తే తగిన విధంగా బుద్ధి చెబుతామని హెచ్చరించారు.
- Tags
- ap cm jagan