విద్యార్థులకు శుభవార్త

by Shyam |   ( Updated:2020-08-08 02:22:04.0  )
విద్యార్థులకు శుభవార్త
X

దిశ ప్రతినిధి, హైదరాబాద్: ఈ నెల 10వ తేదీ ‘‘ వరల్డ్ లయన్ డే ’’ ను నెహ్రూ జువాలాజికల్ పార్క్ లో ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని క్యూ రేటర్ క్షితిజ తెలిపారు. ఈ మేరకు శనివారం ఆమె మీడియాకు ఓ ప్రకటన విడుదల చేశారు. ప్రపంచ సింహం దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరిలో సింహాల జీవన శైలిపై అవగాహన కల్పించాలనే లక్ష్యంతో వీటిని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.

ఇందులో భాగంగా నర్సరీ విద్యార్థుల నుండి 5వ తరగతి వరకు “లైఫ్ ఆఫ్ లయన్” అనే అంశంపై ఆన్‌లైన్ డ్రాయింగ్, పెయింటింగ్ పోటీని నిర్వహిస్తున్నామని, 6 నుండి 12 వ తరగతి విద్యార్థుల కోసం ‘‘ ది లయన్” (ఇంగ్లీష్ లేదా తెలుగు భాషలో 500 పదాలకు మించకూడదు) క్రియేటివ్ స్టోరీ అంశంపై పోటీలు నిర్వహిస్తున్నట్లు వారు పేర్కొన్నారు. ఈ పోటీల్లో పాల్గొనాలనుకునే వారు జూ అధికారిక వెబ్‌సైట్ www.nehruzoopark.in లో లాగిన్ కావాలని పేర్కొన్నారు.

డ్రాయింగ్‌, పెయింటింగ్, స్టోరీలను పీడీఎఫ్ ఫార్మాట్, ఫాంట్ సైజ్ 12 లేదా వర్డ్ doc.at లో సమర్పించాలని సూచించారు. పోటీలలో పాల్గొనాలనుకునే వారు ఈ నెల 10వ తేదీలోగా తమ పేర్లు నమోదు చేసుకోవాలని కోరారు. విజేతలకు నగరంలోని నెహ్రూ జూలాజికల్ పార్క్ నుండి ఈ-సర్టిఫికెట్లు, బహుమతులు ప్రదానం చేయనున్నట్లు ఆమె వెల్లడించారు. ఇతర వివరాలకు పైన సూచించిన జూ వెబ్‌సైట్‌లోకి లాగిన్ కావాలని సూచించారు.

Advertisement

Next Story

Most Viewed