- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కాపురం భూనిర్వాసితులకు గుడ్‌న్యూస్.. పరిహారం ఇచ్చేందుకు ప్రభుత్వం రెడీ
దిశ, మల్హర్: తాడిచర్ల ఉపరితల బొగ్గు బావుల్లో సర్వం కోల్పోయిన కాపురం భూనిర్వాసితులకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ కింద పరిహారం ఇస్తామని జయశంకర్ భూపాలపల్లి జిల్లా జాయింట్ కలెక్టర్ స్వర్ణలత తెలిపారు. బుధవారం మండలంలోని తాడిచర్ల గ్రామ పంచాయతీ ఆవరణలో కాపురం, తాడిచర్ల భూ నిర్వాసితులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మొదటి విడతలో ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ కింద ఒక్కొక్క కుటుంబానికి రూ. 7 లక్షల 61వేల పరిహారం ఇవ్వడం జరుగుతుందని అన్నారు. కాపురంలో 118, తాడిచర్లలో 67 ఇండ్లకు పరిహారం ఇవ్వడం జరుగుతుందని ఆమె నిర్వాసితులకు తెలిపారు. అదేవిధంగా నిర్వాసితులు ఇల్లు నిర్మించుకోవడానికి 9.11 గుంటల భూమిని కేటాయించడం జరిగిందని, ఒక్కొక్క కుటుంబానికి 1,60 పైసల భూమి చొప్పున హద్దులు ఏర్పాటు చేశామని అన్నారు. ఈ విషయంపై ఏమైనా అభ్యంతరాలు ఉంటే తమ దృష్టికి తెలియపరచాలని ఆమె సూచించారు.