ఢిల్లీ అల్లర్లపై కాసేపట్లో విచారణ..

by  |
ఢిల్లీ అల్లర్లపై కాసేపట్లో విచారణ..
X

దిశ,వెబ్‌డెస్క్
ఢిల్లీ తూర్పు,ఈశాన్య ప్రాంతంలో చెలరేగిన సీఏఏ వ్యతిరేక అల్లర్లపై హైకోర్టు సీరియస్ అయ్యింది.ఈ ఘటనలో ప్రాణనష్టంతో పాటు గాయపడిన వారి సంఖ్య కూడా పెద్ద ఎత్తున ఉండటంతో ఢిల్లీ పోలీసులకు కోర్టు నోటిసులు జారీ చేసింది.హింసాత్మక ఘటనలపై వేర్వేరుగా దాఖలైన పిటిషన్లపై కోర్టు మరికాసేపట్లో విచారణ జరపనుంది. అందులో భాగంగానే విచారణకు హాజరుకావాలని పోలీస్ కమిషనర్‌ను న్యాయస్థానం ఆదేశించింది.ఈ ఘటనపై కేంద్ర ప్రభుత్వం సీరియస్‌ అవ్వగా, అల్లర్లకు సంబంధించిన నివేదికలు కూడా తెప్పించుకున్నట్టు సమాచారం.

Advertisement
Next Story

Most Viewed