- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వచ్చేస్తున్నాయ్.. ఆటోమెటిక్ సెల్ఫ్ ఛార్జింగ్ కార్లు
దిశ వెబ్‌డెస్క్: ఎలక్ట్రానిక్ ఛార్జింగ్ కార్లు. పర్యావరణానికి హితమైనవని పేర్లు ఉన్న, ప్రయాణంలో ఉన్నప్పుడు వాటి ఛార్జింగ్ అయిపోతే పరిస్థితి ఏంటని చాలామంది సందేహ పడుతుంటారు. వాటిని కొనాలని అనుకున్నా, ఛార్జింగ్ సమస్యతో వెనకడుగు వేస్తుంటారు. ఇక నుంచి అలాంటి సందేహలు వీడండి. ఎలక్ట్రానిక్ కార్లకు ఛార్జింగ్ పెట్టాల్సిన అవసరం లేదు. ఎందుకంటారా? కార్ల దిగ్గజ కంపెనీ..మారుతీ సుజుకీ సెల్ఫ్ ఛార్జింగ్ జరుపుకునే కార్లను తయారు చేయబోతోంది. ఢిల్లీ కేంద్రంగా ఉన్న మారుతీ సుజుకీ, మరో జపాన్ కంపెనీ అయిన టయోటాతో కలిసి హైబ్రిడ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ (హెచ్ఈవీ) కొన్ని ఎలక్ట్రిక్ వాహనాలపై టెస్టింగ్ నిర్వహిస్తున్నట్టు వెల్లడించాయి. వచ్చే నెల నుంచి ఈ ప్రోటోటైపులపై టయోటోతో కలిసి సంయుక్తంగా టెస్టింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుందని మారుతీ సుజూకీ ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్ రాహుల్ భారతీ పేర్కొన్నారు.
ఈ హైబ్రిడ్ కార్ల వినియోగ నమూనాలపై వినియోగదారుల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకునేందుకు ప్లాన్ చేస్తున్నట్టు తెలిపారు. ఈ సెల్ఫ్ ఛార్జింగ్ కార్లలో ఇంటర్నల్ కంబ్యూషన్ ఇంజిన్ (ఐసీఈ) ద్వారా ఎనర్జీని జనరేట్ అవుతుందని, వీల్ రొటేషన్ ఫీచర్ కూడా ఉందని అన్నారు. ఇది హైబ్రిడ్ కార్లకు మరింత సామర్థ్యాన్ని ఇస్తుందని అంటున్నారు. ఐసీఈ కార్లలో కంటే బ్యాటరీ పవర్ కార్లలోనే అధిక స్థాయిలో మైలేజీ అందిస్తున్నాయని తెలిపారు. వచ్చే 10 నుంచి 15ఏళ్లలో ఈ టెక్నాలజీ మరింత పటిష్టంగా మారుతుందని రాహుల్ ఆకాంక్షించారు. అదనపు ఛార్జింగ్ మౌలిక సదుపాయాలపై ఆధారాపడాల్సిన అవసరం లేకుండా, ఉద్గారాలను కూడా భారీగా తగ్గించగలదని భారతీ వెల్లడించారు. ఈ కంపెనీలతో పాటు టాటా మోటార్స్, మహీంద్రా, హూందాయ్‌లు సైతం వీటిపై ప్రయోగాలు చేస్తున్నట్లు సమాచారం. వీటిని ప్రయోగాత్మకంగా పరీక్షించి చూసి భారత మార్కెట్లోకి ప్రవేశపెట్టాలని ఆలోచిస్తున్నాయి.
గత ఏడాది యూరప్ లో సుజూకీ, టయోటా కలిసి స్వాస్ అనే హైబ్రిడ్ ఎలక్ట్రిక్ కారును లాంచ్ చేశాయి. ఇరు కంపెనీల భాగస్వామ్యంలో 3.6 కెడబ్ల్యూ బ్యాటరీ, 1.8 లీటర్ పెట్రోల్ ఇంజిన్ కూడా ఉంది. అలాగే సెల్ఫ్ ఛార్జింగ్ అవుతుంది. మారుతి సుజుకి 2018 చివరిలో దేశవ్యాప్తంగా 50 మోడిఫైడ్ బ్యాటరీతో నడిచే వాగన్‌నార్ కార్లను టెస్టింగ్ చేయడం ప్రారంభించింది. 2020లో భారతదేశంలో ఫస్ట్ ఫుల్లీ ఎలక్ట్రిక్ వాహనాన్ని వాణిజ్యపరంగా లాంచ్ చేయాలనుకుంది.
కానీ పరిస్థితులు అనుకూలించకపోవటంతో అది సాధ్యం కాలేదు. అయితే 10 లక్షలలోపు ధరతో ఎలక్ట్రానిక్ వాహనాలను 2025 తరువాత దేశంలో ప్రవేశపెట్టాలని మారుతీ లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు అంత తక్కువ ధరలో ఎలక్ట్రిక్ వాహనాలు మార్కెట్లోలేవు. ప్రస్తుతం దేశంలో నెక్సాన్ ఎలక్ట్రానిక్ వాహనాల ధర అతి తక్కువగా 14 లక్షలుగా ఉంది. మరో దేశీయ దిగ్గజం మహీంద్రా కూడా అతి చౌవకగా ఎలక్ట్రానిక్ వాహనాలను తయారు చేస్తున్నట్లు ప్రకటించినా, సరైన సెమికండక్టర్ల లభ్యత లేకపోవటంతో కార్లను ప్రవేశపెట్టలేకపోయింది.