- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
భూమి రిజిస్ట్రేషన్ కోసం వచ్చిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రి
X
దిశ, శంకర్‌పల్లి: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్‌రెడ్డి శుక్రవారం శంకర్‌పల్లి తహశీల్ధార్ కార్యాలయానికి వచ్చారు. శంకర్‌పల్లి మండలం జనవాడ గ్రామంలో సర్వే నంబర్ 719 లో 9-30 ఎకరాల భూమి కొనుగోలు చేయడంతో భూమి రిజిస్ట్రేషన్ కోసం స్లాట్ బుక్ చేసుకున్నాడని తహశీల్ధార్ కృష్ణ కుమార్ తెలిపారు. ఆయన రాక సందర్భంగా కార్యాలయంలోకి ఎవరినీ అనుమతించకుండా సెక్యూరిటీ సిబ్బంది గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.
భూమి రిజిస్ట్రేషన్ పూర్తి కాగానే బయటకు వస్తుండగా తెలంగాణ ఉద్యమంలో పోరాటం చేసిన శంకర్‌పల్లి మండలం పత్తేపూర్ గ్రామానికి చెందిన పండిత్‌రావు ఆయనను తనకు తాను పరిచయం చేసుకున్నాడు. తెలంగాణ ఉద్యమం చేసిన సమయంలో మీరు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పని చేస్తున్నారని మాటలు కలుపుతూ ఆయనతో ఫోటోలకి ఫోజులు ఇచ్చారు.
Advertisement
Next Story