- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రాజీనామా తర్వాత కలెక్టర్ వెంకట్రామి రెడ్డి రియాక్షన్ ఇదే.. (వీడియో)
దిశ, తెలంగాణ బ్యూరో : సిద్దిపేట కలెక్టర్ వెంకట్రామిరెడ్డి వాలంటరీ రిటైర్మెంట్(వీఆర్ఎస్) తీసుకున్నారు. సోమవారం బీఆర్‌కే భవన్‌లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్‌ను కలిసి రాజీనామా లేఖను అందజేశారు. త్వరలోనే టీఆర్ఎస్‌లో చేరనున్నట్లు ప్రకటించారు. టీఆర్ఎస్‌లో ఎప్పుడు చేరాలన్న ఆదేశాలు మాత్రం ఇంకా రాలేదని, సీఎం కేసీఆర్ నుంచి ఆదేశాలు రాగానే చేరుతానని తెలిపారు. రాజీనామాను ప్రభుత్వం ఆమోదించిందని వెల్లడించారు. అన్ని ప్రభుత్వ శాఖల్లో తాను పని చేశానని చెప్పారు. కేసీఆర్ మార్గనిర్దేశం ప్రకారం పనిచేస్తానని ప్రకటించారు.
కాగా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానంలో అవకాశం కల్పిస్తామని సీఎం కేసీఆర్ హామీ మేరకే కలెక్టర్ వెంకట్రామిరెడ్డి రాజీనామా చేసినట్టు తెలిసింది. భాను ప్రసాద్ స్థానంలో అవకాశం కల్పించే అవకాశాలు ఉన్నాయి. 1996లో గ్రూపు-1 లో సెలక్ట్ అయిన ఆయన డిప్యూటీ కలెక్టర్‌గా ఉద్యోగాన్ని పొందారు. బందరు ఆర్డీవోగా, చిత్తూరు, తిరుపతి డ్వామా పీడీగా, మెదక్‌లో హుడా సెక్రటరీ, జోనల్ కమిషనర్, ఇన్ క్యాప్ ఎండీగా, జాయింట్ కలెక్టర్‌గా, సంగారెడ్డి కలెక్టర్ గా పని చేశారు. జాయింట్ కలెక్టర్‌గా, కలెక్టర్‌గా ఏడు సంవత్సరాలు పనిచేశారు. ప్రస్తుతం సిద్దిపేట కలెక్టర్‌గా పని చేస్తున్నారు.
కేసీఆర్ ఏ బాధ్యత అప్పగించిన స్వీకరిస్తా
అభివృద్ధిలో భాగస్వామ్యం అయ్యేందుకే పదవికి రాజీనామా చేసినట్లు సిద్దిపేట కలెక్టర్ వెంకట్రామిరెడ్డి తెలిపారు. సోమవారం రాజీనామా అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో ఏడేళ్లలో జరిగిన అభివృద్ధిని ప్రత్యక్షంగా చూశానన్నారు. సీఎం కేసీఆర్ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నారని, ఏ పని చేయాలన్నా గంటల తరబడి ఆలోచించే వ్యక్తి ఆయన అని కొనియాడారు. అభివృద్ధికి బాటలు చేసే వ్యక్తి కేసీఆర్ అని అన్నారు. ఈ నేపథ్యంలోనే టీఆర్ఎస్‌లో చేరుతున్నట్లు ప్రకటించారు. కేసీఆర్ ఏ బాధ్యత అప్పగించినా స్వీకరిస్తానని పేర్కొన్నారు. దేశంలోనే ఇరిగేషన్‌ను మొదటి స్థానంలోకి తీసుకొచ్చిన ఘనత కేసీఆర్‌దేనని అన్నారు.