పండిన ప్రతి ధాన్యపు గింజను కోనుగోలు చేస్తాం : కలెక్టర్ శరత్

by Shyam |
పండిన ప్రతి ధాన్యపు గింజను కోనుగోలు చేస్తాం : కలెక్టర్ శరత్
X

దిశ, నిజామాబాద్: రైతులు పండించిన ప్రతి ధాన్యం గింజను కొనుగోలు చేస్తామని కామారెడ్డి కలెక్టర్ శరత్ అన్నారు. యాసంగీలో కామారెడ్డి జిల్లాలో437 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామని తెలిపారు. కామారెడ్డి కలెక్టరేట్ జనహిత హాలులో శుక్రవారం విలేకరులతో మాట్లాడారు. ప్రభుత్వ అదేశాల మేరకు రైతులు పండించిన ప్రతి ధాన్యం గింజను కొనుగోలు చేస్తామని, డబ్బుల చెల్లింపులకు కోదవ లేదని అన్నారు. జిల్లాలో కొనుగోలు కేంద్రాల ద్వారా ఇప్పటి వరకు లక్ష 70 వేల మెట్రిక్ టన్నుల వరిధాన్యం కొనుగోలు చేశామని వెల్లడించారు. వడగండ్ల వానతో నష్టపోయిన రైతుల వివరాలు వ్యవసాయ శాఖ అధికారులు సేకరిస్తున్నారని చెప్పారు. ఇతర రాష్ట్రాల నుంచి మన జిల్లాకు 713 మంది వ్యక్తులు వచ్చారని వారిని 28 రోజులపాటు గృహనిర్బంధంలో ఉంచుతామని అన్నారు. వారికి కమ్యూనిటీ, అఫీషియల్ వాచ్‌లను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. రాష్ట్ర సరిహద్దులో ఉన్న 15 గ్రామాల్లో కట్టుదిట్టమైన ఏర్పాట్లు కొనసాగుతున్నాయని తెలిపారు. మాస్కులు ధరించని వారికి 1000 రూపాయల జరిమానా విధిస్తామని అని హెచ్చరించారు. జిల్లాలో మహిళా సంఘాల ఆధ్వర్యంలో9.90 లక్షల మాస్కులు తయారు చేసి గ్రామీణ ప్రాంతాల్లో6.60 లక్షలు, పట్టణ ప్రాంతాల్లో3.30 లక్షల మాస్క్‌లను విక్రయించినట్లు చెప్పారు. టెలికాం, పోస్టల్, మీసేవ, పెట్రోల్ బంకులకు అనుమతి ఉందని చెప్పారు. జిల్లాలో 27 రోజులుగా కరోనా పాజిటివ్ కేసులు లేనందున గ్రీన్‌జోన్ లోకి వచ్చిందని పేర్కొన్నారు. ఎస్పీ శ్వేత మాట్లాడుతూ ఇప్పటి వరకు 9500 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకొని నిబంధనలు ఉల్లంఘించిన వారికి జరిమానాలు విధించామన్నారు. 251 మందిపై కేసులు నమోదు చేశామని పేర్కొన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ వెంకటేష్ దోతురే, అసిస్టెంట్ కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ పాల్గొన్నారు.

Tags: Nizamabad,collector Sharath,Review,crop

Advertisement

Next Story

Most Viewed