- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
టోకెన్ల ద్వారా ధాన్యం కోతలు, కొనుగోళ్లు
X
దిశ, మెదక్: రైతులు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేస్తామని సిద్దిపేట జిల్లా కలెక్టర్ వెంకట్రామిరెడ్డి అన్నారు. గురువారం సిద్దిపేట కలెక్టర్ కార్యాలయంలో ఆయా శాఖల అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి ఒక్క రైతుకు ప్రత్యేక టోకెన్లు అందజేసి పంట కోతలు, ధాన్యం కొనుగోళ్లు చేయాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలోని 345 కొనుగోలు కేంద్రాలకుగాను 345 మంది ప్రత్యేక అధికారులను నియమించి గ్రామస్థాయిలో క్షేత్రస్థాయి సమావేశాలు ఏర్పాటు చేయాలని సూచించారు. ఆ సమావేశంలో గ్రామ సర్పంచ్, కార్యదర్శి, 30 మంది రైతులు, వీఏవోలు సంబంధిత అధికారులు పాల్గొని టోకెన్ నెంబర్లను అందజేయాలన్నారు. ఎవరు ముందు నాటు వేశారు.. అనే దాని ప్రకారంగా వారికి టోకెన్ నెంబర్లు కేటాయించాలని కలెక్టర్ అధికారులకు తెలిపారు. అదే విధంగా గతంలో ఏయే కొనుగోలు కేంద్రాలలో ఎన్ని హార్వెస్టర్లు పనిచేశాయి.. ప్రతి రోజు ఎంత ధాన్యం కొనుగోలు చేశారు, ఎన్ని రోజులు కొనుగోలు చేశారు అనే వివరాలను దృష్టిలో ఉంచుకోవాలని చెప్పారు. దీని ద్వారా రోజు వారీగా ఎంత ధాన్యాన్ని కొనగలుగుతాం అనే విషయాలను పరిగణనలోకి తీసుకొని టోకెట్లు అందజేయాలని కలెక్టర్ వెంకట్రామిరెడ్డి అధికారులకు వివరించారు.
Tags: collector Venkatramireddi, review, token system, Grain, cuts and purchases, siddipet
Advertisement
Next Story