- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వారికి ప్రత్యేక తర్ఫీదు ఇవ్వండి..
దిశ, సూర్యాపేట: జిల్లాలో కరోనా వైరస్ నేపథ్యంలో మాస్క్ లు, శానిటైజర్ , హ్యాండ్ వాష్‌ల తయారీలో స్వయం సహాయ సంఘ సభ్యులకు ప్రత్యేక తర్ఫీదు ఇవ్వాలని జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణా రెడ్డి తెలిపారు. గురువారం కలెక్టరేట్‌లో 16 మండల సంఘ సభ్యులకు అడిషనల్ పీడీ సంజీవ రావు ఆధ్వర్యంలో ప్రత్యేక శిక్షణ కల్పించడం జరిగిందన్నారు. ప్రభుత్వం సంఘాల ద్వారా మాస్క్, శాని టైజర్, హ్యాండ్ వాష్ తయారీ కోసం జిల్లాకు రూ. 20 లక్షలు మంజూరు చేసిందన్నారు. జిల్లాలోని మార్కెట్లలో వచ్చే రక రకాల మాస్కులు, హ్యాండ్ వాష్, శానిటైజర్ల మోడల్స్‌కు ధీటుగా తయారీ చేసి సంఘాల ఆర్థిక బలోపేతానికి చేయూత నందించాలని తెలిపారు. ఇప్పటికే జిల్లాలో కరోనా వైరస్ నేపథ్యంలో డీఆర్డీఏ ద్వారా ఉచితంగా 35 వేలకు పైగా క్లాత్ మాస్కులు తయారు చేసి పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు. సంఘాలు తయారు చేసిన వస్తువులకు మార్కెటింగ్ సదుపాయం కల్పించాలని డీఆర్డీఏ అధికారులను ఆదేశించారు. ఇప్పటికే 80 మంది మహిళా సంఘాల సభ్యులకు ప్రత్యేక శిక్షణ కల్పించడం జరిగిందన్నారు.