- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘రాజన్న’ జాతరకు పకడ్బందీ ఏర్పాట్లు: కలెక్టర్ కృష్ణభాస్కర్
మహాశివరాత్రి పురస్కరించుకుని వేములవాడకు పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తారని, ఈ సమయంలో ఎలాంటి అంటు వ్యాధులు ప్రబలకుండా ముందస్తు జాగ్రత్తలు చేపట్టాలని రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్ ఆదేశించారు. వేములవాడ ఆలయంలో సౌకర్యాల కల్పనపై బుధవారం ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో కలెక్టర్ కృష్ణభాస్కర్ మాట్లాడుతూ ఈసారి 20 శాతం భక్తులు అధికంగా వస్తారని, దీన్ని దృష్టిలో పెట్టుకొని ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని రద్దీ రూట్లలో అదనపు బస్సు సర్వీసులను ఏర్పాటు చేయాలన్నారు. ఆర్టీసీ, ప్రైవేటు వాహనాల కోసం ఏర్పాటు చేసే పార్కింగ్ స్థలాల వద్ద కంట్రోలర్స్, సిబ్బందిని ఏర్పాటు చేయాలని సూచించారు. కంట్రోల్ రూముల వద్ద ప్రజా సమాచార వ్యవస్థలు ఏర్పాటు చేసి, అనౌన్స్‌మెంట్ సౌకర్యాలు ఉండేలా చర్యలు చేపట్టాలని కృష్ణ భాస్కర్ ఆదేశించారు. బస్టాప్‌ల వద్ద మౌలిక వసతులు కల్పించాలని, పారిశుద్ధ్య నిర్వహణ సరిగ్గా ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. పోలీసు శాఖతో సమన్వయం చేసుకుని వాహనాల రాకపోకలకు వేర్వేరు రూట్లను ఏర్పాటు చేయాలని ఆర్టీసీ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. వేములవాడ పట్టణంలో ప్రత్యేక లైటింగ్ వ్యవస్థను ఏర్పాటు చేయాలని, రోడ్లను పరిశుభ్రంగా ఉంచాలని, స్పీడ్ బ్రేకర్లకు రంగులు, సైన్ బోర్డులను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. భక్తుల కోసం చలువ పందిళ్లు వేసి, లైటింగ్, తాగునీటి సరఫరా ఏర్పాటు చేయాలన్నారు.