- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పునరావాస కేంద్రాల్లో కలెక్టర్ తనిఖీలు
దిశ, మేడ్చల్: దుండిగల్, మేడ్చల్, కొంపల్లి, గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీల్లో వలస కార్మికుల కోసం ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలను జిల్లా కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణలో భాగంగా లాక్‌డౌన్ ప్రకటించిన నేపథ్యంలో సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. ఈ కేంద్రాల్లో ఇతర రాష్ట్రాల నుంచి వలస వచ్చిన వారికోసం భోజన, మంచినీటి సదుపాయంతో పాటు వైద్యం, మరుగుదొడ్లు, రాత్రికి బస ఏర్పాట్లు చేశామని వివరించారు. ఆయా కేంద్రాల్లోని వలస కార్మికులను అడిగి భోజన సదుపాయం, వసతి గురించి అడిగి తెలుసుకున్నారు. వైద్య శిబిరాన్ని పరిశీలించి కావాల్సిన అన్ని మందులను అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. మేడ్చల్ ప్రభుత్వ ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన ఐసోలేషన్ సెంటర్‌ను పరిశీలించారు. అక్కడ మరుగుదొడ్లు లేకపోవడాన్ని గుర్తించి వెంటనే నిర్మించాలని అధికారులను ఆదేశించారు.
tag: Collector, checks, rehab centers, medchal