వాటర్ తాగమన్న రోనాల్డో.. రూ.29వేల కోట్లు నష్టపోయిన Cococola కంపెనీ

by Anukaran |
cristiano-ronarldo 1
X

దిశ, వెబ్‌డెస్క్ : కొవిడ్-19 నుంచి ప్రపంచం ఇంకా కోలుకోకముందే యూరప్ కంట్రీస్ EURO-2020 పేరిట ఫుట్ బాల్ గేమ్స్‌ను ప్రారంభించిన విషయం తెలిసిందే. వరల్డ్ వైడ్ క్రికెట్ కంటే సాకర్ గేమ్‌కు అభిమానులు ఎక్కువగా ఉంటారనేది అక్షర సత్యం. అయితే, పోర్చుగల్ జట్టు రథసారధి, ఫుట్‌బాట్ దిగ్గజం క్రిస్టియానో రోనాల్డో చేసిన ఒక్క ప్రకటన కోకకోలా (Cococola) కంపెనీకి మైండ్ బ్లాక్ అయ్యేలా చేసింది. సాఫ్ట్ డ్రింక్ సామ్రాజ్యానికి రారాజు కోకకోలా.. ప్రపంచ వ్యాప్తంగా సప్లయ్ అయ్యే సాఫ్ట్ డ్రింక్స్‌లో దాదాపు 70 శాతానికి పైగా Cococola ఉత్పత్తులే ఉండటం విశేషం.

యూరో చాంపియ‌న్‌షిప్‌ పోటీల్లో భాగంగా మంగ‌ళ‌వారం రోనాల్డో త‌న తొలి మ్యాచ్ హంగ‌రీతో ఆడ‌బోతున్నాడు. బుడాపెస్ట్‌లో ఈ మ్యాచ్ జ‌ర‌గ‌నుంది. సరిగ్గా మ్యాచ్‌కు ముందు మీడియా సమావేశంలో మాట్లాడేందుకు రోనాల్డో, అతని కోచ్ శాంటోస్ వచ్చారు. ఆ స‌మ‌యంలో అతని ముందు రెండు సాఫ్ట్ డ్రింక్ బాటిల్స్ కనిపించాయి. వాటిని చూసిన వెంటనే తీసి ప‌క్కన పెట్టేసిన రోనాల్డో.. వీటి బ‌దులుగా ‘‘మంచి నీళ్లు తాగండి’’ అంటూ అక్కడే ఉన్న వాట‌ర్ బాటిల్‌ను చేతిలోకి తీసుకుని పైకెత్తి చూపించాడు. దీనిని అంతర్జాతీయ మీడియా మొత్తం కవర్ చేసింది. వ‌ర‌ల్డ్‌ బెస్ట్ ఫుల్‌బాల‌ర్స్‌లో ఒక్కరైనా క్రిస్టియానో రోనాల్డో ఇలా చూపించాక ఇంకేముంది. కోకకోలా కంపెనీకి ఊహించని షాక్ తగిలింది. అసలు అతను ఇలా ఎందుకు చేశాడో కాసేపు ఎవరికీ అర్థం కాలేదు.

ఇది జరిగిన కేవలం 30 నిమిషాల నుంచి గంట వ్యవధిలోనే కోకకోలా కంపెనీ షేర్స్ 1.6 శాతం మేర పడిపోయాయి. సుమారు $242 billion నుంచి $238 billion మేర సంపద ఆవిరైంది. ఇండియన్ కరెన్సీలో చెప్పాలంటే సుమారు రూ.29వేల కోట్ల నష్టం వాటిల్లింది. అయితే, యూరో-2020 చాంపియన్ షిప్ టోర్నీ స్పాన్సర్లలో Cococola వన్ ఆఫ్ ది కంపెనీ. కాగా, జంక్ ఫుడ్, సాఫ్ట్ డ్రింక్స్ తీసుకోవడం వలన చిన్న పిల్లల నుంచి పెద్ద వారిలో ఊబకాయం పెరిగిపోతుందని.. దీనివలన అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందని.. అతని పదేళ్ల కొడుకుని దృష్టిలో పెట్టుకుని రోనాల్డో ఈ ప్రకటన చేసినట్లు వెల్లడైంది.

Advertisement

Next Story

Most Viewed